BigTV English

Chandrababu: CBN అన్‌స్టాపబుల్‌.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం..

Chandrababu: CBN అన్‌స్టాపబుల్‌.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం..
cbn smile

Chandrababu: అన్‌స్టాపబుల్ NBK మాత్రమే కాదు.. చంద్రబాబు కూడా. నాలుగు ఎమ్మెల్సీలు గెలుచుకున్న ఉత్సాహంలో చంద్రబాబు జోరు మీదున్నారు. నాలుగులో మూడు క్లీన్ స్వీప్ అవటం.. మరొకటి సంచలన విజయం కావడంతో బాబులో జోష్‌ అన్‌స్టాపబుల్‌గా ఉంది. ఎమ్మెల్సీలు గెలిచిన సంబరంలో ఉండగానే.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరడంతో పార్టీలో పండగ వాతావరణం నెలకొంది. నెల్లూరు నుంచి మంగళగిరికి వందలాది వాహనాల కాన్వాయ్‌తో అట్టహాసంగా బలప్రదర్శన చేస్తూ కోటంరెడ్డి బ్రడర్ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోవడంతో టీడీపీ కాక మీదుంది. చంద్రబాబు విజయోత్సవ ప్రసంగం మామూలుగా లేదు.


టీడీపీ ఇక అన్‌స్టాపబుల్‌ అని.. గేర్‌ మార్చి స్పీడ్‌ పెంచుతామని.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తామని చంద్రబాబు పంచ్ డైలాగ్‌లు వదిలారు. వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్‌పై నమ్మకం లేదని.. చాలా మంది ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని వైసీపీని మరింత డిఫెన్స్‌లో పడేశారు చంద్రబాబు. ఇకపై అధికారపార్టీతో మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేడర్‌కు సూచించారు.

పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చిందని, దాని ఫలితమే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ బలపడింది కాబట్టి.. నవంబరులోనో, డిసెంబరులోనూ జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది మరింత జాగ్రత్తగా ఉండాలని.. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఇదే చివరిసారి కావాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×