BigTV English

Nivetha Pethuraj : అతని చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్.. అయ్యో పాపం..

Nivetha Pethuraj : అతని చేతిలో దారుణంగా మోసపోయిన హీరోయిన్.. అయ్యో పాపం..

Nivetha Pethuraj : కొలీవుడ్ స్టార్ హీరోయిన్ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. అయితే ఈమె రీసెంట్ గా పరువు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పలకరించింది.. అది మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అది ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెబ్ సిరీస్ ఏమో గాని ఆమె పై విమర్శలు అందుకుంది. నెటిజన్లు దారుణంగా తిట్టారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే.. లేటెస్ట్ ఫొటోలతో పాటుగా, తనకు సొసైటీలో ఎదురైన సమస్యల గురించి కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఆమె మోసపోయానని ఓ పోస్ట్ చేసింది. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..


తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ లో ఫ్రెండ్ ను కలవడానికి వెళ్తూ అడయార్‌ సిగ్నెల్‌ వద్ద కారులో ఆగిందట. ఆ సమయంలో ఎనిమిదేళ్ళ బాలుడు డబ్బులు అడిగాడు. ఉచితంగా డబ్బులు ఇచ్చేందుకు నా మనసు అంగీకరించలేదు. దీంతో ఒక 50 విలువైన పుస్తకాన్ని కొనాలని చెప్పడంతో 100 నోటు తీయగా, ఆ బాలుడు 500 అడిగాడని చెప్పింది. దీంతో పుస్తకాన్ని బాలుడికి తిరిగి ఇచ్చి, నేను ఇచ్చిన రూ.100 నోటు వెనక్కి తీసుకున్నాను. అయితే, ఆ పిల్లవాడు పుస్తకాన్ని కారులో పడేసి… చేతిలోని రూ.వంద నోటు లాక్కొని పారిపోయాడు’ అని చెప్పింది. ఈ విషయాన్ని చెబుతూ బయట జనాలు ఇలా ఉన్నారు. జాగ్రత్త అని హెచ్చరించింది. దాంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ అమ్మడు కేరీర్ విషయానికొస్తే.. కోలీవుడ్‌లో యువనటి నివేదా పేతురాజ్‌ ‘ఒరునాల్‌ కూత్తు’, ‘పొదువాగ ఎన్‌మనసు’, ‘టిక్‌ టిక్‌ టిక్‌’ వంటి అనేక చిత్రాల్లో నటించిన ఆమె… ఇపుడు చెన్నైలోనే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకూ ఆమె సుపరిచితమే. ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో సుశాంత్‌కి లవర్‌గా ఆమె నటించింది. ‘మెంటల్ మదిలో, చిత్రలహరి, పాగల్, దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆమె వెబ్ సిరీస్‌లతో బిజీ నటిగా గడుపుతోంది. ఇక తెలుగులో మరో ప్రాజెక్టు లో నటించనుందని సమాచారం.. త్వరలోనే ఆ ప్రాజెక్టు గురించి వివరాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×