BigTV English

Lady Aghori: అఘోరీకి ప్రమాదం పొంచి ఉందా? అందుకే ఆ లాయర్ రక్షణ కోరారా?

Lady Aghori: అఘోరీకి ప్రమాదం పొంచి ఉందా? అందుకే ఆ లాయర్ రక్షణ కోరారా?

Lady Aghori: అఘోరీ నాగ సాధువు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో తెలియని వారుండరు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా అఘోరీ నాగసాధువు ఎంత వైరల్ అయ్యారో చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఓ న్యాయవాది ఏకంగా ఏపీలో ఆమెకు రక్షణ క‌ల్పించాల‌ని ఆన్‌లైన్‌లో డీజీపీని కోరారు. అంతేకాదు ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారట ఆ న్యాయవాది.


తెలంగాణకు చెందిన అఘోరీ ముత్యాలమ్మ ఆలయంపై దాడి జరిగిన సమయంలో ఆలయంలో పూజలు నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా ఎన్నో ప్రకటనలు, ఇలా ఒకటి కాదు ఆమె నోటి నుండి వచ్చిన ప్రతి మాట వైరల్. కానీ తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నట్లు, తన మాటలను వక్రీకరించడం తగదని ఆమె తనపై వస్తున్న కామెంట్స్ పై స్పందించారు. అంతేకాదు తెలంగాణ నుండి వెళ్లిన అఘోరీ, తాను ఆత్మార్పణం చేసుకుంటానని ప్రకటించి సంచలనం రేకెత్తించారు.

తన ఆత్మార్పణం కూడా ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద జరుగుతుందని ప్రకటించగా, భక్తులు అలర్ట్ కాగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. చివరికి వేములవాడ వద్ద అఘోరీని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకొని, ఆమె స్వగ్రామం కుశ్నపల్లికి తరలించారు. అక్కడ కొంతసేపు హడావుడి కూడా నెలకొంది. పోలీసులు ఆత్మార్పణం వద్దని కోరడం, అలాగే పెద్ద ఎత్తున భక్తులు గ్రామానికి చేరుకొని నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, ఏమి చెప్పినా వింటామని అఘోరీ మాతకు మాటిచ్చారు. దీనితో అఘోరీ కొంత వెనుకడుగు వేయగా, పోలీసులు ఆమెను కాన్వాయ్ తో రాష్ట్రం దాటించారు.


అసలు అఘోరీ కారు కనిపిస్తే చాలు, అక్కడ ఆమె భక్తులు ప్రత్యక్షం కావడం, ఆశీస్సులు పొందడం పరిపాటిగా మారింది. అందుకే పోలీసులు కూడా బందోబస్తు చేపట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే తొలి కార్తీక సోమవారం సంధర్భంగా అకస్మాత్తుగా అఘోరీ మాత శ్రీశైలం లో ప్రత్యక్షమయ్యారు. అక్కడ పూజలు నిర్వహించిన ఆమె వైజాగ్ దారి పట్టారు. అలా వెళ్తున్న క్రమంలో టోల్ ప్లాజా వద్ద అఘోరీకి సిబ్బందికి వివాదం చెలరేగింది. ఈ వివాదంలో తనపై దాడికి యత్నించారంటూ, అఘోరీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Also Read: Viral News: నేనే పరమశివుడిని.. ఆరడుగుల గొయ్యి త్రవ్వండి.. పూనకంతో ఊగిన బాలుడు.. ఎక్కడంటే?

అంతేకాదు మంగళవారం వైజాగ్ లో నాగుల పంచమిని పురస్కరించుకొని శివాలయానికి వెళ్లి పూజలు కూడా నిర్వహించారు అఘోరీ మాత. అయితే టోల్‌గేట్ వ‌ద్ద అఘోరిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆమెకు రక్షణ కల్పించాలని న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ ఆన్ లైన్ ద్వారా కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుగుతున్న అఘోరీకి రక్షణ క‌ల్పించాల‌ని ఏపీ హైకోర్ట్‌లో పిటీషన్ వేసేందుకు న్యాయవాది సిద్దమవుతున్నారట. అలాగే అఘోరీ మాతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం కూడా భాద్యత వహించాలని ఆమె భక్తులు కోరుతున్నారు. మరి డీజీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×