E-Paper
Advertisement

Sai Pallavi: సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. ఇక నుంచి ఆమె పేరు ఇదే

Sai Pallavi: సాయి పల్లవికి కొత్త ట్యాగ్ ఇచ్చిన చైతన్య.. ఇక నుంచి ఆమె పేరు ఇదే
Advertisement

Sai Pallavi: సినిమా ఇండస్ట్రీలో ట్యాగ్స్ లేని హీరోలు లేరు. మెగాస్టార్.. పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్, ఐకాన్ స్టార్.. ఇలా హీరో పేరుకు ముందు కచ్చితంగా  ట్యాగ్ ఉండాల్సిందే. అందులో చాలా ట్యాగ్స్ అభిమానులు ఇచ్చినవే. ఇక హీరోలకు మాత్రమే కాదు.. హీరోయిన్లకు కూడా ట్యాగ్స్ ఉన్నాయి. అయితే చాలా తక్కువ మందికి ఉన్నాయి. అనుష్క శెట్టి.. లేడీ  సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో కొనసాగుతుంది.

ఇక  ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సాయిపల్లవి.. సినిమాలతో పాటు వ్యక్తిగతంగా కూడా  అభిమానులకు దగ్గరవ్వడంతో ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను ఇచ్చారు. పవర్ స్టార్ కు ఉన్నంత ఫ్యాన్ బేస్ ఉందని.. శ్యామ్ సింగరాయ్ సినిమా సమయంలో ఆ ట్యాగ్ ను అందించారు. అప్పటి నుంచి సాయి పల్లవి పేరు ముందు ఫ్యాన్స్  లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ ను పెడుతూ వచ్చారు.  ఇక ఇప్పుడు ఆమెకు మరో కొత్త ట్యాగ్ వచ్చి చేరింది. ఆ ట్యాగ్ ను అక్కినేని కుర్ర హీరో నాగచైతన్య  చెప్పుకురావడం విశేషం.

Advertisement

Thandel: తండేల్.. ఫిబ్రవరి రిలీజ్ వెనుక ఇంత కథ ఉందా..?

చై, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  ఫిబ్రవరి 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ.. సాయి పల్లవికి బాక్సాఫీస్  క్వీన్ అని ట్యాగ్ ఇచ్చాడు.

Advertisement

Samantha: స్పెషల్ నైట్ కోసం సిద్ధమయిన సమంత.. ఇంతకీ ఏంటా స్పెషల్?

” మన బాక్సాఫీస్ క్వీన్  సాయి పల్లవి గారు. నిజంగా ఈ సినిమాను తన పాత్రవరకే కాకుండా కంప్లీట్  స్క్రిప్ట్ గా చూసుకుంది. ఎన్నోసార్లు కాల్ చేసి నా పాత్ర గురించి, తన పాత్ర గురించి కాకుండా .. సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసేది. ఇక నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను.. పల్లవితో డ్యాన్స్ చేయాలంటే కొంచెం భయం. ఎప్పుడు  నాకు సపోర్ట్ చేస్తూ ఆ విషయంలో నాకు చాలా చేసింది” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకనుంచి సాయి పల్లవి పేరు.. బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవిగా  మారిందని  ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చై- సాయి పల్లవి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×