E-Paper
Advertisement

35 Chinna Katha Kaadu Teaser: #90s ను గుర్తుచేస్తున్న నివేదా కొత్త సినిమా

35 Chinna Katha Kaadu Teaser: #90s ను గుర్తుచేస్తున్న నివేదా  కొత్త సినిమా
Advertisement

35 Chinna Katha Kaadu Teaser:అందాల భామ నివేదా థామస్ ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. నాని హీరోగా నటించిన జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే హిట్ టాక్ ను అందుకొని అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఈ బ్యూటీ ఆ తరువాత వరుస సినిమాలతో ఆకట్టుకుంది. గ్లామర్ ను నమ్ముకోకుండా పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప సినిమాలను ఒప్పుకోకుండా చాలా సెలక్టీవ్ గా సినిమాలు చేస్తూ వస్తుంది.

ఇక ఆమె చివరగా.. 2022 లో శాకినీ డాకిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీని తరువాత మలయాళంలో ఒక సినిమా చేసిన నివేదా.. దాదాపు రెండేళ్ల తరువాత ఒక అద్భుతమైన కథతో ప్రేక్షకులను అలరించనుంది. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నంద కిషోర్ ఈమని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 35 చిన్న కథ కాదు. ఈసినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. రానా దగ్గుబాటి సమర్పించడం విశేషం.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే.. అచ్చ తెలుగు సినిమాలా కనిపిస్తుంది. గత ఏడాది రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న #90s వెబ్ సిరీస్ గుర్తుకొస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రంలో నివేదా ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది.

ఒక మిడిల్ క్లాస్ కుటుంబం.. పిల్లల చదువు కోసం కష్టపడే తల్లిదండ్రులు. ఇద్దరిలో ఒకడు చదువుతాడు.. ఇంకొకడు చదవడు. పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి.. కొడుకును ఎలాగైనా చదివించాలని చూస్తోంది. కానీ, ఆ పిల్లాడికి మ్యాథ్స్ అస్సలు రావు. దీంతో అందరూ ఆ పిల్లాడిని తిట్టడం కొట్టడం చేస్తూ ఉంటారు. ఆ బాధ భరించలేక ఆ పిల్లడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇక కొడుకు కోసం ఆ తల్లి ఏం చేసింది.. ? అనేది కథ.

Advertisement

చదువురానీ పిల్లలను ఇంట్లో, స్కూల్ లో ఎలా చూస్తారు.. ? ఆ పిల్లలు ఎంత వేదన అనుభవిస్తారు. మార్కులు తప్ప ఇంకేం వద్దు అనుకొనే ఉపాధ్యాయులు, డబ్బులు కడుతున్నాం.. బాగా చదవాలి అని ఒత్తిడి చేసే తల్లిదండ్రుల మధ్య పిల్లలు ఎలా నలిగిపోతున్నారు అనేది కథగా చూపించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నివేదా రీఎంట్రీ హిట్ అందుకుంటుందో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×