BigTV English
Advertisement

Nvidia CEO Jensen Huang: నా కెరీర్ తొలి నాళ్లలో టాయిలెట్లను కూడా శుభ్రం చేశా : ప్రముఖ కంపెనీ సీఈఓ

Nvidia CEO Jensen Huang: నా కెరీర్ తొలి నాళ్లలో టాయిలెట్లను కూడా శుభ్రం చేశా : ప్రముఖ కంపెనీ సీఈఓ

Nvidia CEO Jensen Huang: ఏ పని చేసినా కూడా అది చిన్నదైనా.. పెద్దదైనా గౌరవించడం చాలా ముఖ్యం. చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ముందుకెళ్తే అందులో అద్భుతాలు సృష్టించవచ్చు. ఆ అనుభవమే ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు దోహదపడుతుంది. ఇందుకు ఉదాహరణగా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. కడు పేదరికంలో పుట్టి కనీవినీ ఎరుగని రీతిలో రాణించిన వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి కోవకు చెందినవారే ప్రముఖ ఓ ఎలక్ట్రానిక్ చిప్ ల తయారీ సంస్థ సీఈఓ.


కెరీర్ తొలినాళ్లలో ఏ పని దొరికితే ఆ పని చేసేవారు. ఆఖరుకు టాయిలెట్లు కడిగే పనికి సైతం వెళ్లారు. అయినా కూడా ఏ రోజు బాధపడలేదు. ఆ పనిని ఇష్టపడుతూ అందరికంటే బెస్ట్ గా చేసేవారు. ఈరోజు సీఈఓ స్థాయికి ఎదిగారు. ఆయనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

దిగ్గజ ఎలక్ట్రానిక్ చిప్ ల తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాను ఎదుర్కొన్న కష్టాలు.. చేసిన పని గురించి అందులో ప్రస్తావించారు. పనికి తాను ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చేవాడినని చెప్పారు. కెరీర్ తొలినాళ్లలో తనకు దొరికిన పనినల్లా చేసుకుంటూ పోయానని చెప్పారు. అది ఏ పనైనా సరే ఏరోజు కూడా నిరుత్సాహపడలేదన్నారు. ఆఖరుకు టాయిలెట్లు కడిగే పనికి కూడా వెళ్లానని చెప్పారు. అందులో బెస్ట్ గా రాణించానని చెప్పారు.


Also Read: ఇండోనేషియాలో దారుణం, మహిళను మింగేసిన కొండ చిలువ

“పని విషయానికి వస్తే నేను ఒకటే చెబుతా. అది ఏ పనైనా చిన్నది కాదు. చేసే పని చిన్నదైనా సరే దానికి విలువ ఇవ్వాలి. అదేవిధంగా ఆ పనిని గొప్పగా గౌరవించాలి. అప్పుడే మనం ఎదుగుతాం. కెరీర్ తొలినాళ్లలో నేను ఓ బ్రేక్ ఫాస్ట్ సెంటర్ లో పనిచేశాను. అప్పుడు గిన్నెలు శుభ్రం చేశాను. టాయిలెట్లు కూడా కడిగాను. ఇక్కడున్న మీ అందరూ కలిసి కడిగినదానికంటే ఎక్కువ టాయిలెట్లు కూడా శుభ్రం చేశాను. ఆ అనుభవమే నాకు అన్ని రకాల పనులను గౌరవించడం నేర్పింది. దాని వల్లే ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీలో ప్రతి ఒక్క ఉద్యోగిని సమానంగా చూడగలుగుతున్నాను. వారి భుజంపై చేయి వేసి అండగా నిలబడుతున్నాను. ఈ ప్రపంచంలో తక్కువ అనే పని ఏదీ లేదు” అని సీఈఓ హువాంగ్ అన్నారు.

Also Read: బైడెన్ క్లారిటీ, రేసులో ఉన్నా.. గెలుపు మనదే అంటూ..

అయితే, ఈ ఏడాది మార్చిలో స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ఈ వీడియోను ఓ జర్నలిస్ట్ తాజాగా షేర్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. హువాంగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తనదైన శైలిలో ఓ పోస్ట్ కూడా పెట్టారు.

Tags

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×