E-Paper
Advertisement

Nora Fatehi: ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన నోరా ఫతేహి

Nora Fatehi: ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన నోరా ఫతేహి
Advertisement

Nora Fatehi: అందాల ముద్దుగుమ్మ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2014లో ‘రోర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ అమ్మడు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పలు ఐటెమ్ సాంగ్‌లలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ‘బాహుబలి’ సినిమాలో మనోహరీ సాంగ్‌లో నటించి అలరించింది.

అయితే ఈ అమ్మడు తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో తన కోస్టార్‌తో గొడవపడిందట. ఏకంగా అతడి చెంప చెల్లెమనిపించిందట. ఆ గొడవ కాస్త పెద్దదిగా మారి ఇద్దరు జట్లు పట్టుకొని కొట్టుకున్నారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తుచేసుకుంది నోరా ఫతేహి.

Advertisement

‘‘నా మొదటి సినిమా రోర్ షూటింగ్ సమయంలో నా కోస్టార్‌ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నాకు కోపం వచ్చి.. అతని చెంప చెల్లుమనిపించా. దీంతో అతను కూడా నాపై చేయి చేసుకున్నాడు. సెట్‌లో అందరి ముందే ఇద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకున్నాం. అప్పుడు దర్శకుడు మమ్మల్ని అడ్డుకొని సర్ధి చెప్పాడు. దీంతో గొడవ సర్దుమణిగింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఇక నోరా తెలుగులో ‘బాహుబలి’, ‘టెంపర్’, ‘కిక్-2’ వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి అలరించింది. తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. ప్రస్తుతం అటు బాలీవుడ్‌లో ఇటు తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×