BigTV English
Advertisement

Rahul Sipligunj : పాతబస్తీ నుంచి ఆస్కార్ వరకు.. ఆ కుర్రోడి జర్నీ సాగిందిలా..!

Rahul Sipligunj : పాతబస్తీ నుంచి ఆస్కార్ వరకు.. ఆ కుర్రోడి జర్నీ సాగిందిలా..!

Rahul Sipligunj : ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఎంతో చురుకు. గిన్నెలపై గరిటెలతో వాయించేవాడు. చెంచాలను వాయిస్తూ పాటలు పాడేవాడు. ఇల్లంతా అల్లరి అల్లరి చేసేవాడు. చాలామంది తల్లిదండ్రులా మాదిరిగా వారు తమ బిడ్డను తిట్టలేదు. కొట్టలేదు. అలా వాయించవద్దని చెప్పలేదు. ఆ చిన్నారిలో ఉన్న టాలెంట్ ను గుర్తించారు. అతని ఇష్టాన్ని ప్రోత్సహించారు. గజల్ మాస్టార్ వద్ద శిక్షణ ఇప్పించారు. కాలక్రమంలో ఆ పిల్లాడు గాయకుడయ్యాడు. తన వాయిస్ తో శ్రోతలను మైమరించాడు. ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు. సింగర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక సెలబ్రిటీగా మారాడు. అక్కడితో అతని ప్రయాణం ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అతడే రాహుల్ సిప్లిగంజ్.


రాహుల్ సిప్లిగంజ్ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. హైదరాబాద్ పాతబస్తీ మంగళహాట్ లో పెరిగాడు. చిన్నవయస్సులోనే పాటలు పాడటంపై ఇంట్రెస్ట్ చూపించాడు. ఎంతో శ్రద్ధతో సంగీతంపై పట్టుసాధించాడు. చదువుకునే రోజుల్లో ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో సాయం చేసేవాడు. జానపద పాటలను ఎంతో ఇష్టంగా పాడేవాడు. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగం కోసం వెతకలేదు. తనకిష్టమైన రంగంలోనే స్థిరపడాలనుకున్నాడు. సినిమాల్లో ప్రయత్నాలు చేశాడు. క్రమంలో సినిమా ఛాన్సులు దక్కాయి.

రాహుల్‌ మొదటిసారి ‘నాకొక గర్ల్‌ఫ్రెండ్‌ కావాలి’, ‘జోష్‌’ చిత్రాల్లో పాటలు పాడాడు. ఆ తర్వాత కీరవాణి కోరస్‌ టీమ్‌లో భాగమయ్యాడు. ‘ఈగ’, ‘దమ్ము’, ‘మర్యాద రామన్న’ సినిమాల కోసం పనిచేశాడు.‘లై’లోని ‘బొమ్మోలే’పాటకు విశేషణ ఆదరణ వచ్చింది. రంగస్థలంలో పాడిన పాటతో పాపులారిటీ పెరిగింది. రంగా రంగా రంగ స్థలాన అంటూ పాడిన ఆ గొంతు సంగీతప్రియులను ఉర్రూతలూగించింది. రాహుల్ వాయిస్ లో బేస్ పాటకు ప్రాణం పోసింది. ఇక వెనుదిరిగి చూసుకోలేదు. గాయకుడిగా చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనూ యువతలో క్రేజ్ సంపాదించుకున్నాడు.


బిగ్ బాస్ తో స్టార్ డమ్
బిగ్ బాస్-3 షో రాహుల్ సిప్లిగంజ్ ను ప్రతి తెలుగుంటికి పరిచయం చేసింది.అంతకుముందు రాహుల్ గాత్రం మాత్రమే విన్న ప్రేక్షకులు.. అతడేంటో తెలుసుకున్నారు. ముక్కుసూటి తత్వాన్ని మెచ్చారు. అతనికే ఓటు వేశారు. బిగ్ బాస్ విన్నర్ గా పట్టం కట్టారు.

బిగ్ బాస్ తర్వాత కూడా రాహుల్ సిప్లిగంజ్ ప్రయాణం మారలేదు. పాటనే నమ్ముకున్నాడు. ఈ క్రమంలో RRR సినిమాకు పాట పాడే ఛాన్స్ దక్కించుకున్నాడు. నాటు నాటు పాటను కాలభైరవతో కలిసి పాడాడు. ఇప్పుడు అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. మార్చి 12న ఆస్కార్ వేదిక పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు.

Sai Dharam Tej: అభిమాని మృతి.. టీజర్‌ వాయిదా.. రియల్ హీరో సాయిధరమ్ తేజ్..

Jeevitha: 30 త‌ర్వాత‌ జీవితా రాజ‌శేఖ‌ర్ రీ ఎంట్రీ

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×