BigTV English

METAL : మెటల్‌ను తయారు చేయడానికి సులువైన మార్గం..

METAL : మెటల్‌ను తయారు చేయడానికి సులువైన మార్గం..

ఒకప్పుడు మనిషి కష్టపడి మిషిన్‌ను నడిపించాల్సిన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత కేవలం ఒక బటన్ నొక్కతే.. మిషిన్ దానంతట అదే పనిచేసేలా టెక్నాలజీ ఏర్పాటయ్యింది. ఇప్పుడు మనిషి మాటను బట్టి, సూచనను బట్టి మిషిన్లు పనిచేయడం మొదలుపెట్టాయి. అందుకే అన్ని రంగాల్లో ఇలాంటి ఆటోమేటిక్ మిషిన్లు ఉండాలని శాస్త్రవేత్తలు కోరుకుంటున్నారు. అందుకే రోలింగ్ మిల్స్ విషయంలో కూడా ఇలాంటి ఒక మిషిన్‌నే తయారు చేయనున్నారు.


రోలింగ్ మిల్స్ అనేవి మెటల్‌ను (METAL)తయారు చేయడంలో ఉపయోగపడే యంత్రాలు. ఇవి పనిచేయడానికి ఎంతో కరెంటు కావాల్సి ఉంటుంది. దానివల్ల అప్పుడప్పుడు నష్టాలు కూడా చవిచూడాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ యంత్రాలు అనేవి ఎప్పుడు ఆగిపోతాయో చెప్పలేం. అందుకే అలాంటి సమస్యలను దూరం చేయడానికి ఈ రోలింగ్ మిల్స్ కోసం ఒక ఆటోమేటెడ్ ఎలక్ట్రానిక్ డ్రైవ్‌ను తయారు చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ విభాగంలో ప్రయోగాలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

రోలింగ్ మిషిన్‌లో ఎక్కువగా ఉపయోగపడేది కేజ్. ఈ కేజ్‌లోనే రోలింగ్ అనేది పూర్తవుతుంది. కేజ్ అనేది ఎలా డిజైన్ చేశాము అనేదాన్ని బట్టే రోలింగ్ మిషిన్ పర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది. ప్రొడక్టివిటీ, ప్రొడక్ట్ క్వాలిటీ, ఎనర్జీ.. ఇలా ఎన్నో విషయాలు దీనిపైనే ఆధారపడుంటాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించి దీనికొక కొత్త మ్యాథమాటికల్ మోడల్‌ను తయారు చేశారు.


మామూలుగా రోలింగ్ మిల్‌లో పెట్టే మెటల్ లావుగా ఉంటే.. అది కేజ్‌పై ఒత్తిడిని తీసుకొస్తుంది. ఇది 12000 టన్నుల వరకు ఒత్తిడిని భరించగలుగుతుంది. కానీ అంత లోడ్ పెట్టినప్పుడే పరికరం అనేది పాడయ్యే అవకాశాలు ఏర్పడతాయి. అందుకే రోలింగ్ మిల్ ఎలా పనిచేయాలి, ఎంత ఒత్తిడిని కేజ్‌లో నింపాలి అనే విషయాలను గమనించడానికి శాస్త్రవేత్తలు ఒక న్యూరల్ నెట్‌వర్క్‌ను తయారు చేశారు. ఇది ఆటోమెటిక్‌గా రోలింగ్ మిల్‌ను ఎప్పుడూ కనిపెడుతూ దాని వల్ల కలిగే ఇబ్బందులను వెంటనే తెలియజేస్తుంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×