E-Paper
Advertisement

NTR 30:- షూట్ బిగిన్స్‌.. సెట్స్‌లోకి యంగ్ టైగ‌ర్‌

NTR 30:- షూట్ బిగిన్స్‌.. సెట్స్‌లోకి యంగ్ టైగ‌ర్‌

NTR 30:- యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న NTR 30 సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు స్టార్ట్ అయ్యింది. దాదాపు ఏడాది నుంచి తార‌క్ అభిమానులు ఆయ‌న సినిమా ఎప్పుడు అధికారికంగా లాంచ్ అవుతుందా? షూటింగ్ ఎప్ప‌టి నుంచి స్టార్ట్ అవుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులు ఫ‌లించాయి. ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చేశాడు. సెట్స్‌లోకి అడుగు పెడుతున్న‌ప్పుడు తీసిన వీడియోను ఎన్టీఆర్ స‌హా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. వ‌స్తున్నా అంటూ అందులో అంద‌రికీ హింట్ ఇచ్చేశాడు తార‌క్‌. మ‌రోసారి కొర‌టాల‌తో క‌లిసి సెట్స్‌లో సంద‌డి చేయబోతుండ‌టం ఆనందంగా ఉంద‌ని ఎన్టీఆర్ ట్వీట్ కూడా చేశారు.

NTR 30 సినిమా షూటింగ్ స్టార్ట్ కాక‌ముందు వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా రిలీజ్ అవుతుంద‌ని మేక‌ర్స్ అనౌన్స్ చేసేశారు. ఇటు ఎన్టీఆర్‌కి, అటు కొర‌టాల ఇద్ద‌రికీ NTR 30 చాలా కీల‌కంగా మారింది. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ఐదు భాష‌ల్లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ ఇందులో మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. కృతి శెట్టి సెకండ్ లీడ్‌గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. ర‌త్న‌వేలు, అనిరుద్‌, సాబు సిరిల్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్ వంటి స్టార్ టెక్నీషియ‌న్స్‌తో పాటుహాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పటికే యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం కెన్నీ బేట్స్ టీమ్‌లో జాయిన్ అయ్యారు. రీసెంట్‌గా గ్రాండియ‌ర్ విజువ‌ల్ ఎఫెక్ట్ కోసం బ్రాడ్ మిన్నెచ్ పార్ట్ అయ్యారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై హ‌రి కృష్ణ‌.కె, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐడియా ఫార్‌ అక్రాస్‌ కోస్టల్‌ ల్యాండ్స్ ఆఫ్‌ ఇండియా, ఫర్‌గాటెన్‌ ల్యాండ్స్ లో సెట్‌ అయిన కథ ఇది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. భయమంటే ఏంటో తెలియని మృగాలుంటారు. దేవుడంటే భయం లేదు. చావంటే భయం లేదు. అలాంటి మనుషులను మన యంగ్ టైగర్ ఎలా భయపెట్టాడనేదే కథాంశం.

బన్నీతో మురుగదాస్‌ మూవీ.. ఎప్పుడంటే.. డైరెక్టర్ క్లారిటీ!

for more updates follow this link:-Bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×