BigTV English

Allu Arjun: బన్నీతో మురుగదాస్‌ మూవీ.. ఎప్పుడంటే.. డైరెక్టర్ క్లారిటీ!

Allu Arjun: బన్నీతో మురుగదాస్‌ మూవీ.. ఎప్పుడంటే.. డైరెక్టర్ క్లారిటీ!
bunny murugadoss

Allu Arjun: బన్ని.. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్. ఆచితూచి ఎంచుకుంటున్నారు సినిమాలు. స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. మురుగదాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ అనేసరికి భారీ హైప్ వచ్చింది. అంతలోనే కరోనా కూడా వచ్చింది. తెలిసిందేగా అన్ని ప్రాజెక్టులు అటకెక్కాయి. అందులో బన్ని-మురుగదాస్ సినిమా కూడా చేరింది. పుష్ప తర్వాత అయినా వారిద్దరి సినిమా వస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.


తాను నిర్మించిన ‘16 ఆగస్టు 1947’ చిత్ర ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చారు దర్శకుడు మురుగదాస్. అల్లు అర్జున్‌తో మూవీపై క్లారిటీ ఇచ్చీ ఇవ్వనట్టు మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…

“కరోనా కారణంగా అందరికీ గ్యాప్‌ వచ్చింది. హీరో తన కెరీర్‌లో చాలా మంది దర్శకులను కలుస్తాడు. అలాగే డైరెక్టర్‌ కూడా అనేకమంది హీరోలను కలుస్తాడు. ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్టు మొదలువుతుంది. ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. తెలుగులో కచ్చితంగా ఒక సినిమా చేస్తా. ప్రేక్షకుడి అంచనాలు, దర్శకుడి క్రియేటివిటీ కలిస్తే ఆ సినిమా కచ్చితంగా హిట్టవుతుంది”.. అంటూ చెప్పిచెప్పనట్టు చెప్పారు.


ఇంతకీ మురుగదాస్ ఏం చెప్పారబ్బా? బన్నీతో సినిమా ఉంటుందనా? ఉండదనా? ఇప్పుడు కాకపోయినా.. ఇంకెప్పుడైనా చేస్తాననా? ఏమో ఆయనకే తెలియాలి.

చాలాకాలంగా మురుగదాస్ సినిమాలు చేయట్లేదు. రజనీకాంత్‌తో తీసిన దర్బార్ అంతగా ఆడలేదు. చేతిలో కొత్త ప్రాజెక్ట్ కూడా ఏదీ ఉన్నట్టు లేదు. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్ స్టార్ డమ్ పాన్ ఇండియా రేంజ్‌కి పెరిగింది. ఈ సమయంలో మురుగదాస్‌తో బన్ని సినిమాను ఆశించడం అనవసరం. గతం గతః.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×