BigTV English

TSPSC: ఆ బావ, బావమరిది ఎవరు?.. రేవంత్‌రెడ్డి ట్వీట్ మీకర్థమవుతోందా?

TSPSC: ఆ బావ, బావమరిది ఎవరు?.. రేవంత్‌రెడ్డి ట్వీట్ మీకర్థమవుతోందా?
revanth reddy tspsc

TSPSC: రేవంత్‌రెడ్డి నెట్‌వర్కే వేరబ్బా. ఎక్కడి నుంచి వస్తుందో కానీ, కీలక సమాచారం ఆయన దగ్గర ఉంటుంది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో రేవంత్‌ దూకుడు మామూలుగా లేదు. సిట్ దగ్గర కంటే కూడా పీసీసీ చీఫ్ దగ్గరే ఎక్కువ ఇన్‌ఫర్మేషన్ ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రశ్నాపత్రాల లీక్‌లో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. గతంలోనూ గ్రూప్ 1 పేపర్ ఎన్నారైలకు అమ్ముకున్నారని అన్నారు. సిట్‌ విచారణకు హాజరై తన దగ్గర ఉన్న సమాచారం అందించారు. లేటెస్ట్‌గా ట్విట్టర్‌లో మరో బాంబు పేల్చారు రేవంత్‌రెడ్డి.


ఈ కేసులో TSPSC కార్యదర్శి లింగారెడ్డిని 4 గంటల పాటు విచారించింది సిట్. ఈ సమయంలోనే రేవంత్‌రెడ్డి ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. “టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా? విచారణలో ‘బావ’.. తెలంగాణ సీఎంవోలో బావమరిది?.. మీకు అర్థమవుతోందా..’పరువు’గల కేటీఆర్ గారూ” అంటూ రేవంత్ నర్మగర్భంగా ట్వీట్ చేశారు. ట్వీట్‌తో పాటు ప్రొఫెసర్ బండి లింగారెడ్డి ప్రొపైల్‌ను కూడా షేర్ చేశారు. దీంతో రేవంత్ చేసిన ఆరోపణ ఎవరి గురించా? అనే చర్చ మొదలైంది.

విచారణలో బావ.. అంటే అది పక్కా లింగారెడ్డిని ఉద్దేశించే అంటున్నారు. ఆయన్ను సిట్ విచారణకు పిలిచిన సమయంలోనే రేవంత్ ట్వీట్ చేయడం, ఆయన ప్రొఫైల్‌ను షేర్ చేయడంతో.. ఆ ‘బావ’ లింగారెడ్డినే అని చెబుతున్నారు. మరి, తెలంగాణ సీఎంవోలో బావమరిది? ఎవరనేది తెలియాల్సి ఉంది. బహుషా.. లింగారెడ్డికి బావమరిది వరుస అయ్యే బంధువు ఎవరైనా సీఎంవోలో ఉన్నారా? అని ఆరా తీస్తున్నారు. అదే నిజమైతే.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ తీగలాగితే ప్రగతి భవన్ డొంక కదిలిందా? అంటూ రేవంత్ చేసిన కామెంట్ మరింత కీలకం కానుంది. ప్రగతి భవన్ పెద్దల డైరెక్షన్‌లోనే పేపర్ లీక్ తతంగం జరిగిందా? అనే అనుమానం రాకమానదు. ఆ బావమరిది ఎవరో తేలితేగానీ.. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ కేటీఆర్‌కు మినహా.. సామాన్యులకు అర్థం కాకపోవచ్చు అంటున్నారు.


Related News

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

Big Stories

×