BigTV English
Advertisement

War 2 : ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ చనిపోతాడా? స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా…!

War 2 : ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ చనిపోతాడా? స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా…!

War 2 : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ సినిమా వచ్చి నెల పూర్తి అయిన సినిమా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇంకా దేవర సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ నెలలోనే దేవర మూవీ ఓటీటీలోకి రాబోతుంది.. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్‌ 2’ సినిమాలో నటిస్తున్నారు. యశ్‌ రాజ్ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్‌ రోషన్‌ గతంలో చేసిన వార్‌ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ కోసం హిందీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వార్ 2 లో ఎన్టీఆర్‌ నటిస్తున్న కారణంగా సౌత్‌ ప్రేక్షకులు సైతం ఇప్పుడు వార్‌ 2 కోసం వెయిట్‌ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ విపరీతమైన బజ్ క్రియేట్‌ చేస్తున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ కీలకమైన గెస్ట్‌ రోల్స్‌లో కనిపించబోతున్నారని గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక తాజాగా ఈ మూవీ స్టోరీ లీకైనట్లు తెలుస్తుంది. వార్ 2 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అసలు విషయం ఏంటో ఓ లుక్ వేద్దాం..


వార్ 2 మూవీ.. 

గతంలో వచ్చిన వార్ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కించనున్నది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వార్ 2.. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానున్నది. ఈ క్రేజీ మూవీలో యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు.. ఇకపోతే తాజాగా ఈ మూవీ స్టోరీ లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


వార్ 2 ఎన్టీఆర్ చనిపోతాడా?

ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాటుగా అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో తెరకేక్కనున్న సంగతి తెలిసిందే.. దేవర తర్వాత రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యాడు..విలే పార్లే స్టూడియోలో ఈ సినిమా కోసం భారీ సెట్‌ని వేశారంట. ఈ సెట్ లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సెట్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో ఎన్టీఆర్ ఫోటోల కూడా ఉన్నాయి. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ వార్ లో చనిపోతాడని, ఆ తర్వాతే హృతిక్ రోషన్ పూర్తిగా మారిపోతాడని సమాచారం. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ వార్తల పై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×