NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన “దేవర – పార్ట్ 1” తెలుగులో భారీ అంచనాల మధ్య విడుదలైంది. నెగటివ్ టాక్ వచ్చినా, సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ అయి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్‌లో గ్రాండ్ లెవల్‌లో విడుదల అవుతోంది. ఎన్టీఆర్ జపాన్ లో గట్టి ఫ్యాన్‌బేస్ సంపాదించుకున్న నేపథ్యంలో, “దేవర” కూడా అక్కడ సాలిడ్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు..
“దేవర” విడుదల సమయంలో నెగటివ్ రివ్యూల ప్రభావం
“దేవర” సినిమా విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. కొరటాల శివ మార్క్ కథా కథనం లేకపోవడం, రొటీన్ సేవియర్ కథతో శివ దేవర సినిమా చేసాడు కామెంట్స్ వచ్చాయి. స్క్రీన్‌ప్లే కొంత నెమ్మదిగా ఉందని, కథలో కొత్తదనం ఎక్కువగా కనిపించలేదని విమర్శలు వచ్చాయి.
అయితే, ఎన్టీఆర్ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్, సంగీతం, విజువల్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. మొదటి వారం తర్వాత పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది. దీంతో సినిమా కాస్తా ఊపందుకుని బ్రేక్ ఈవెన్ సాధించి, ఫైనల్‌గా హిట్‌గా మారింది.
6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో సినిమా – ఫ్యాన్స్ రిటర్న్ గిఫ్ట్!
2018లో వచ్చిన “అరవింద సమేత వీర రాఘవ” తర్వాత ఎన్టీఆర్ ఒక సోలో హీరోగా నటించిన సినిమా “దేవర”. “RRR” సినిమా తర్వాత వచ్చిన సినిమా కావడంతో దేవరపై అభిమానుల అంచనాలు చాలా ఎక్కువగా పెంచుకున్నారు.
సినిమా ప్రారంభంలో నెగటివ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించడం ఎన్టీఆర్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఫ్యాన్స్ నుంచి ఎన్టీఆర్ కి ఈ సినిమా రిజల్ట్ ఒక రేంజ్ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పొచ్చు.
జపాన్‌లో “దేవర” గ్రాండ్ రిలీజ్ – ఎన్టీఆర్, కొరటాల శివ స్పెషల్ ప్రమోషన్స్!
జపాన్‌లో ఎన్టీఆర్‌కి భారీ క్రేజ్ ఏర్పడింది. అక్కడ “RRR” సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో, ఎన్టీఆర్‌కు భారీ ఫ్యాన్‌బేస్ తయారైంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, “దేవర”ను కూడా గ్రాండ్ లెవల్‌లో రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్ వెళ్లి స్వయంగా ప్రమోషన్స్ చేయడం విశేషం. అక్కడ మీడియాతో మాట్లాడి, అభిమానులను కలుసుకుని, సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
జపాన్ బాక్సాఫీస్‌పై “దేవర” ప్రభావం
జపాన్ మార్కెట్‌లో తెలుగు సినిమాలకు పెద్దగా ఆదరణ లభించకపోయినా, బాహుబలి, RRR సినిమా తర్వాత పరిస్థితి మారింది. అక్కడ భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్‌కి మంచి డిమాండ్ ఉంది.
“RRR” చూసిన జపాన్ ప్రేక్షకులు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్‌పై ఫిదా అయ్యారు. ఈ కారణంగా, “దేవర” కూడా అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ బాగా ఉండటంతో, సినిమాపై ట్రేడ్ అనలిస్టులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
ఫైనల్‌గా…
“దేవర” విడుదల సమయంలో నెగటివ్ టాక్ వచ్చినా, చివరికి మంచి వసూళ్లు సాధించి హిట్‌గా నిలిచింది. ఇప్పుడు “దేవర” జపాన్ బాక్సాఫీస్‌ను ఎంతవరకు షేక్ చేస్తుందో చూడాలి!