BigTV English
Advertisement

‘Simhadri’ rerelease collections : ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి మ‌నసు.. ‘సింహాద్రి’ రీరిలీజ్ కలెక్ష‌న్స్‌తో ఏం చేయ‌బోతున్నారంటే!

‘Simhadri’ rerelease collections : ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి మ‌నసు.. ‘సింహాద్రి’ రీరిలీజ్ కలెక్ష‌న్స్‌తో ఏం చేయ‌బోతున్నారంటే!
'Simhadri' rerelease collections

‘Simhadri’ rerelease collections : స్టార్ హీరోల‌కు అభిమానులుండ‌టం స‌హ‌జ‌మే. అయితే వాళ్లు త‌మ అభిమానాన్ని మంచి ప‌నులుకు ఉప‌యోగిస్తే అది హీరో ఇమేజ్‌ను మ‌రింత పెంచుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఆ క్ర‌మంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు మ‌రోసారి తమ మంచి మ‌నుసుని చాటుకుంటున్నారు. ఇంత‌కీ ఏ విష‌యంలోన‌ని అనుకుంటున్నారా? వివ‌రాల్లోకి వెళితే.. ఇప్పుడు స్టార్ హీరో ల‌సినిమాలు రి రిలీజ్‌లు అవుతున్నాయి. ఈ క్ర‌మంలో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్‌, ఆయ‌న్ని స్టార్ హీరో రేంజ్‌కి తీసుకెళ్లిన సినిమా సింహాద్రి. ఈ సినిమాను ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మే 20న రి రిలీజ్ చేస్తున్నారు అభిమానులు.


బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రి రిలీజ్ అవుతుందంటే ఎలాగూ క‌లెక్ష‌న్స్ బాగానే వ‌స్తాయ‌న‌టంలో సందేహం లేదు. మ‌రి ఈ క‌లెక్ష‌న్స్‌ను ఫ్యాన్స్ ఏం చేస్తార‌నే సందేహం రావ‌చ్చు. అయితే తార‌క్ అభిమానులు ఆ డబ్బుల‌ను ఆయా జిల్లాల్లో ఇబ్బందుల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానుల‌కు ఇచ్చేలా నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఎన్టీఆర్‌కు చేరవేయ‌గా, ఆయ‌న కూడా వారిని అభినందించి ఎంక‌రేజ్ చేశార‌ట‌. ఈ మేర‌కు వారు ప్ర‌క‌ట‌న‌ను కూడా రిలీజ్ చేశారు. ఇలాంటి మంచి ప‌ని చేస్తున్న ఫ్యాన్స్‌ను నెటిజన్స్ అభిమానిస్తున్నారు.

ఎన్టీఆర్ అభిమానులు సింహాద్రి చిత్రాన్ని రి రిలీజ్ చేయ‌టానికి హ‌క్కుల‌ను థ‌ర్ట్ పార్టీ నుంచి డ‌బ్బులు పెట్టి ఫ్యాన్సీ రేటుకు కొన్నారు. ఇప్పుడు ఆ సినిమాతో వ‌చ్చే క‌లెక్ష‌న్స్ వేస్ట్ కాకుండా, బ‌య‌ట‌కు పోకుండా ఉండేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు త‌మ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి చేసిన సింహాద్రి చిత్రం అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌కు మాస్‌లో తిరుగులేని ఇమేజ్‌ను క‌ట్ట‌బెట్టింది.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×