BigTV English

Mahesh Babu 28 : మ‌హేష్ డ్యూయెల్ రోల్‌..!

Mahesh Babu 28 : మ‌హేష్ డ్యూయెల్ రోల్‌..!
Mahesh Babu 28

Mahesh Babu 28 : సూప‌ర్ స్టార్ మ‌హేష్ లేటెస్ట్ మూవీ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌న‌దైన మార్క్‌తో త్రివిక్ర‌మ్ సినిమాను ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తూనే మ‌హేష్ అభిమానుల కోసం సినిమాను మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకుంటున్నారు త్రివిక్ర‌మ్‌. ఈ ఏడాదిలో రిలీజ్ చేయాల‌నుకున్న సినిమా కాస్త వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కానుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హేష్ మ‌రే సినిమాలో క‌నిపించ‌ని విధంగా సిక్స్ ప్యాక్ లుక్‌తో క‌నిపించ‌బోతున్నారు. అసలు ఈ లుక్ ఎలా ఉంటుంద‌నేది అంద‌రిలోనూ ఎగ్జ‌యిట్‌మెంట్ పెంచేస్తోంది.


ఇదిలా ఉండ‌గా ఈ సినిమా గురించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మై వార్తొక‌టి నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే ఇందులో మ‌హేష్ డ్యూయెల్ రోల్ చేస్తున్నార‌ని, అది కూడా తండ్రీ కొడుకులుగా. ఇదే నిజ‌మైతే నాని సినిమాలో మ‌హేష్ ఇలా తండ్రీ కొడుకులుగా యాక్ట్ చేశారు. మ‌రే సినిమాలోనూ న‌టించ‌లేదు. క‌చ్చితంగా ఇది అభిమానుల‌కు స‌ర్‌ప్రైజింగ్ విష‌య‌మే అవుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌ను మేక‌ర్స్ ఖండిస్తారో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఎప్ప‌టిలాగానే త్రివిక్ర‌మ్ SSMB 28లో పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక మ‌రో హీరోయిన్‌గా శ్రీలీల క‌నిపిస్తుంది. అత‌ఢు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత అంటే ప‌దేళ్ల త‌ర్వాత మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై బ‌జ్ క్రియేట్ అయ్యింది. త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు మేక‌ర్స్‌. ఎందుకంటే ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ త‌న ఫోక‌స్ అంతా రాజ‌మౌళి సినిమాపైనే పెట్టాల్సి ఉంటుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×