BigTV English

Jr. Ntr : ఎన్టీఆర్ కు తీరని కోరిక ఉందట..ఏంటో తెలుసా..?

Jr. Ntr : ఎన్టీఆర్ కు తీరని కోరిక ఉందట..ఏంటో తెలుసా..?

Jr. Ntr : టాలీవుడ్ యంగ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ స్టార్ హీరో.. ఆ తర్వాత ఇంటర్నేషనల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.. దాంతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. రీసెంట్ గా దేవర మూవీతో అభిమానులను అలరించాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలను అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఎన్టీఆర్ కు ఒక తీరని కోరిక ఉందట. ఆ కోరిక ఇక తీరదు అని బాధ పడుతున్నాడు. ఏంటి ఎన్టీఆర్ కు అలాంటి కోరిక ఒకటి ఉందా? అయితే ఆ కోరిక ఏంటో తెలుసుకుందాం..


నందమూరి వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో హిట్ టాక్ ను అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిందని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడే ఎన్టీఆర్ స్టార్ హీరోగా నిలబడాలని నిర్ణయించుకున్నాడట. ఆయన అనుకున్న విధంగానే అతి తక్కువ కాలంలోనే కెరియర్ పరంగా సక్సెస్ ని సాధించాడు. ట్రిపుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో దేశ వ్యాప్తంగానే కాదు. విదేశాల్లో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత ఆరెళ్లకు సోలో హీరోగా దేవర మూవీతో రీసెంట్ గా ప్రేక్షకులను పలకరించాడు. యావరేజ్ టాక్ ను అందుకుంది. కానీ కలెక్షన్స్ మాత్రం భారీగా వచ్చాయి. దాంతో సినిమా హిట్ అయ్యింది. మరి ఇలాంటి సక్సెస్ ఫుల్ స్టార్ హీరోకి తన నిజ జీవితంలో ఒక తీరని కోరిక ఉందని తెలుస్తుంది.

హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు కానీ జీవితంలో ఒక కోరిక మాత్రం అతనికి అసంతృప్తిగానే మిగిలిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని 2011లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ జంటకి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే తారక్ భార్య రెండవ సారి గర్భవతి అయిన సందర్భంలో కూతురు పుడితే బాగుంటుందని కోరుకున్నాడట.. ఒకవేళ కూతురు పుడితే మంచి పేరు పెట్టాలని అనుకున్నాడట.. ఎన్టీఆర్ ఆశపడిన దానికి వ్యతిరేకంగా రెండవ సారి కూడా కొడుకు పుట్టాడు. నందమూరి ఫ్యామిలీకి తన కూతురు ఆడపడచుగా ఉండాలని ఎన్టీఆర్ భావించగా దానికి భిన్నంగా జరిగిందని ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వార్ 2 సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ చేయబోతున్నాడు.. ఆ తర్వాత దేవర పార్ట్ 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ తర్వాత తమిళ డైరెక్టర్ తో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం..


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×