BigTV English

Bhuma Akhilapriya vs Mounika: అఖిలప్రియ- మౌనిక మధ్య చర్చలు.. ఏం జరిగింది?

Bhuma Akhilapriya vs Mounika: అఖిలప్రియ- మౌనిక మధ్య చర్చలు.. ఏం జరిగింది?

Bhuma Akhilapriya vs Mounika: భూమా అఖిలప్రియ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? మంచు ఫ్యామిలీ జరిగిన పరిణామాలతో అక్క చెల్లెల్లు ఒక్కటయ్యారా? చాన్నాళ్లు తర్వాత ఆళ్లగడ్డపై అడుగుపెట్టిన మౌనికకు ఏం తెలుసొచ్చింది? రాజకీయ ప్రకటనను ఎందుకు వాయిదా వేసుకుంది? ఆస్తుల చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


భూమా అఖిలప్రియ ఫ్యామిలీలో ఆస్తుల వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అఖిలప్రియ-మౌనిక ఫ్యామిలీలు ఎవరికి వారే తన తల్లి శోభనాగిరెడ్డికి ఘాటు వద్ద నివాళులు అర్పించారు. చాన్నాళ్లు తర్వాత భూమా మౌనిక ఫ్యామిలీ ఆళ్లగడ్డలో అడుగుపెట్టింది.

మొన్నటి ఎన్నికల్లో అఖిలప్రియ తరపున ప్రచారం చేయలేదు మౌనిక. దీంతో అక్కాచెల్లెలు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనే ప్రచారం లేకపోలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఆ ప్రచారానికి బ్రేక్ పడిందనే చెప్పవచ్చు. రీసెంట్‌గా మోహన్‌బాబు ఫ్యామిలీలో విభేదాలు పీక్స్‌కు చేరాయి.


ఫ్యామిలీలో గొడవలకు మౌనికే కారణమని మోహన్‌బాబు ఆడియో రిలీజ్ చేయడంవంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మౌనిక దంపతులు ఆళ్లగడ్డకు రావడంతో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైపోయింది. ముఖ్యంగా తల్లి శోభనాగిరెడ్డి పుట్టినరోజు, వర్థంతికి ఘాటుకు వెళ్లి నివాళులు అర్పించేది మౌనిక.

ALSO READ:  శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆర్జిత సేవా, మార్చి నెల ఆన్ లైన్ కోటా విడుదల.. పూర్తి వివరాలివే

మనోజ్‌ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కేవలం తల్లిదండ్రులకు నివాళులు అర్పించి ఘాటు నుంచి మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లిపోయేది మౌనిక. ఈసారి మౌనిక ఆమె భర్త మనోజ్, ఇద్దరు పిల్లలు వచ్చారు. తన అక్క, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ ఇంటికి వెళ్లింది మౌనిక ఫ్యామిలీ. మ్యారేజ్ తర్వాత ఇలా ఇంటికి రావడం ఇదే తొలిసారన్నది స్థానికులు మాట.

మౌనిక ఇంటికి వచ్చిన సమయంలో అఖిలప్రియ అధికారిక కార్యక్రమాల నిమిత్తం బయటకువెళ్లారు. సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చి ఇంట్లోవాళ్లు మౌనికను ఇంట్లోకి ఆహ్వానించారు. తన చెల్లి ఇంటికి వచ్చిందన్న విషయం తెలియగానే వెంటనే ఇంటికి వచ్చేసింది అఖిలప్రియ. ఇటు అఖిలప్రియ-అటు మౌనిక ఫ్యామిలీలు కలిసి కూర్చొని భోజనం చేశాయి.

పేరెంట్స్ చనిపోయిన చాలా రోజుల తర్వాత అఖిలప్రియ-మౌనిక-తమ్మడు విఖ్యాత్‌రెడ్డి ఇలా భోజనం చేసి చాలా రోజులు అయ్యిందట. ఈ ముగ్గురు మధ్య దాదాపు రెండు గంటల సేపు ఆస్తుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.  ఆస్తుల వివాదాన్ని సామరస్యంగా పంచుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఇప్పుడున్న ఫ్యామిలీ సమస్యలు సద్దు మణిగిన తర్వాత అందరం కూర్చుని మాట్లాడుకుందామని అప్పటివరకు ఎలాంటి విషయం బయటకు పొక్కరాదని సూచన చేసిందట అఖిలప్రియ. దీంతో ఫ్యామిలీ అంతా సైలెంట్ అయిపోయింది. ఇదే సమయంలో మౌనిక-మనోజ్ దంపతుల జనసేనలోకి చేరుతారని, స్పష్టమైన ప్రకటన వస్తుందంటూ జోరుగా ప్రచారం సాగింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాకు దూరంగా ఉండాలని అఖిలప్రియ సలహా ఇచ్చిందట. దీంతో మౌనిక-మంచు మనోజ్ సైతం దూరంగా ఉన్నారు. ఒకానొక దశలో మీడియా ఈ విషయాన్ని లేవనెత్తినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు మనోజ్. జరుగుతున్న పరిణామాలు చూసిన స్థానికులు.. అఖిలప్రియ-మౌనిక మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతున్నారు. మొత్తానికి ఆస్తుల వివాదంలో ఓ అడుగుపడిందనే చెప్పవచ్చు.

Related News

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Big Stories

×