Janasena Vizianagaram: ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన విచిత్రమైన పరిస్థితి ఎదుర్కుంటుంది. జిల్లాకు సంబంధించి ఆ పార్టీకి ఒక లేడీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇటీవలే మరో వీరమహిళలకు నామినేటెడ్ పదవి కూడా దక్కింది. అయినా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. జిల్లా జనసేన అధ్యక్షుడి నియామకం కూడా ఇంత వరకు జరగలేదు. దాంతో జిల్లా పార్టీకి పెద్ద దిక్కులేకుండా పోయాడని, తమకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదని జనసైనికులు వాపోతున్నారు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేనకి పెద్ద దిక్కెవరు అంటే నో అనే సమాధానం వస్తోంది . ఇప్పటివరకూ జిల్లా అద్యక్షుడుని కూడా ఆ పార్టీ నియమించలేదు . కనీసం ఆ పార్టీ రాష్ట్రస్థాయి నేతలెవరైనా జిల్లాకి వస్తే వారిని ఆహ్వానించడానికి కూడా తటపటాయిస్తున్నారు స్థానిక నేతలు . ఎవరి పరిచయాలు బట్టి వాళ్ళు ఆయా నేతలకు స్వాగతం పలుకుతున్నారు . అయితే ఇది ఇప్పటి సమస్య కాదట . పార్టీ స్థాపించిన నాటి నుండి ఇదే పరిస్థితి నెలకొంది .
పార్టీ స్థాపించి పదేళ్ళు పూర్తయినా ఇప్పటికీ ఉమ్మడి విజయనగరం జిల్లాకి సరైన నాయకుడు లెడంటే అతిశయోక్తి కాదు . 2024 వరకూ ఆ పార్టీకి ఓట్లు సీట్లు లేకపోవచ్చి గానీ , ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామిగా ఉంది . కూటమిలో సెకండ్ ప్లేస్ కూడా . ఆ పార్టీ బాస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు . కానీ జిల్లాలో మాత్రం పార్టీ తరపున ఓ బాస్ ని నియమించలేకపోయారు. దీంతో కార్యకర్తలకి, నాయకులకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు గ్లాసు పార్టీ శ్రేణులు
గత ఎన్నికల వరకు జిల్లాలో కనీసం ఎంపీటీసీ లేని ఆ పార్టీకి నేడు ఎమ్మెల్యే కూడా ఉన్నారు . నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఇటీవల కూటమి తరపున గాజుగ్లాసు గుర్తుపై గెలిచారు . కానీ తన ఇళ్లే తాను సరిగ్గా చక్కదిద్దుకోలేకపోతున్నారట . ఓ వైపు టీడీపీ నాయకులతో పొరపొచ్చాలు , మరోవైపు జనసేనలో నిజమైన కార్యకర్తలను ఆమె పట్టించుకోవడం లేదన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి . పార్టీతో సంబంధం లేకుండా స్వయంగా తానొక బ్రాండ్ ఇమేజ్ సంపాదించాలన్న కార్పొరేట్ ఆలోచనతో చతికిల పడుతున్నారంటూ స్వంత పార్టీ నేతలె ఆరోపించడం గమనార్హం .
Also Read: అంబటికి జగన్ షాక్.. సత్తెనపల్లిలో వైసీపీకి కొత్త ఇంచార్జ్
కార్పొరేట్ లెవెల్ లో కొనడం అమ్మడం అన్న చందంగా కేవలం వైసీపీ కార్యకర్తలను, నాయకులను చేర్చుకొని అదే సొంతబలంగా ఫీలవుతున్నారట సదరు ఎమ్మెల్యే . వ్యాపారవేత్త కావడంతో ఆమె ఆలోచనలు కూడా అలానే ఉంటున్నాయని, కార్యకర్తల కష్టాలు ఆమెకి అర్ధం కావడం లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి . మరోవైపు పార్టీ అధిష్టానం కూడా పైసలు లెక్కతో ఆమెకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి .
మరోవైపు ఇటీవల తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా నామినేటెడ్ పదవి పొందిన పాలవలస యశస్వి ఉన్నా ఆమెను జనసైనికులు ఏమాత్రం నాయకురాలిగా ఆమోదించడం లేదన్నది బహిరంగ రహస్యం . ఆమె నాన్ లోకల్ అంటూ మొదటినుండీ జిల్లా నాయకులకు ఆమెతో పొసగడం లేధు . జిల్లా కేంద్రంలోనే ఉంటున్నప్పటికీ ఆమె ఎపుడూ ఎవరికీ అందుబాటులో ఉండరు అనేది ప్రధాన ఆరోపణ . అయితే మొదటినుండి పార్టీలోనే ఉండడం కాపు కులం కావడంతో ఆమెకి తూర్పు కాపు కార్పొరేషన్ పదవి వరించింది. దీంతో పాటు ఆమె విజయనగరం నియోజకవర్గ ఇంచార్జ్ కూడా . అలా అని నియోజకవర్గ నాయకులతో కూడా ఆమె సమావేశాలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవు . రిచ్ అండ్ పూర్ లెక్కలు వేసినా ఎవడైతే నాకేంటి అనే స్టైల్ లో ఆమెకి ఎవరితోనూ సత్సంబంధాలు లేవనటంలో ఎలాంటి డౌట్ లేదన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి .
పదవులు అనుభవిస్తున్న నాయకులు ఒక్కొక్కరు ఒక్కో తీరుతో వ్యవహరించడంవలన కార్యకర్తకి కష్టమొస్తే మొరపెట్టుకోడానికి జిల్లాకి ఓ పెద్ద దిక్కు ఉంటే బాగుండు అన్న చర్చ జనసైనికుల్లో నడుస్తోంది . అయితే కార్యకర్తలకే కాదు .. నాయకులకు కూడా దిక్కు లేదట . పార్టీ కోసం లాయల్ గా పని చేసిన ఏ ఒక్కరికీ న్యాయం జరగడం లేదని, ఇకనైనా పార్టీ జిల్లా నాయకత్వంపై దృష్టి సారించాలని అభిప్రాయపడుతున్నారు జనసైనికులు .