BigTV English

Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో ఎన్టీఆర్.. మెంటలెక్కించే న్యూస్..

Allu Arjun : అల్లు అర్జున్ మూవీలో ఎన్టీఆర్.. మెంటలెక్కించే న్యూస్..

Allu Arjun : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో మూవీలో మరో స్టార్ హీరో నటించడం లేదా గెస్ట్ రోల్ లో కనిపించడం కామన్.. అయితే ఒక స్టార్ హీరో సినిమాకు తన గొంతును ఇవ్వడం విశేషం. అర్థం కాలేదు కదా.. హీరో మరో హీరో మూవీకి డబ్బింగ్ చెప్పడం లేదా పాట పాడటం ఈరోజుల్లో ఎక్కువగా జరుగుతుంది. భారీ బడ్జెట్ తో వస్తున్నా సినిమాల పై జనాల్లో హైప్ ను క్రియేట్ చేసేందుకు ఫ్యాన్స్ ను. ఆకట్టుకోవడం కోసం దర్శక నిర్మాతలు ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య ఇలాగే సినిమాలు వస్తున్నాయి కూడా. ఇక విషయానికొస్తే.. అల్లు అర్జున్ మూవీలో ఎన్టీఆర్ అంటూ ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఏ మూవీలో? ఎక్కడా కనిపిస్తాడు? అసలు ఈ మ్యాటర్ నిజమా? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఆలస్యం ఎందుకు ఆ మూవీ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..


అల్లు అర్జున్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ పుష్ప 2.. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీలో జాతర ఎపిసోడ్ కీలకం. సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ సన్నివేశం సుమారుగా 20 నిమిషాల నిడివి తో ఉంటుంది. ఈ సన్నివేశం మొత్తం అల్లు అర్జున్ తన నట, నాట్య విశ్వరూపం చూపించేసాడు. ఆయన పెర్ఫార్మన్స్ థియేటర్స్ లో నిజంగానే కొంతమందికి అమ్మోరు సోకినట్టు అయ్యింది. వాళ్లంతా పూనకలొచ్చి ఊగిపోవడం వంటివి వీడియోల ద్వారా మన కళ్లారా చూసాము. అయితే ఈ పాట గురించి సోషల్ మీడియాలో రకరకాల పూకార్లు వినిపిస్తున్నాయి. ఆ పాట పాడింది ఎవరు? అసలు ఎన్టీఆర్ ఈ పాటను నిజంగానే పాడారా? అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే ఆ పాటలో వాయిస్ అచ్చం ఎన్టీఆర్ లాగే ఉంది.

నిజానికి ఆ పాటను పాడింది ఎన్టీఆర్ కాదు. అల్లు అర్జున్ కు వీరాభిమాని అట.. ఎన్టీఆర్ వాయిస్ లాగా ఉంది అంటూ ఒక వీడియో చేసాడు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. అచ్చు గుద్దినట్టు ఎన్టీఆర్ పాడినట్టే సింక్ చేస్తే ఈ వీడియో ని జత చేసారు. కానీ ఒరిజినల్ గా పాటను పాడింది మాత్రం మహాలింగం.. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ రాయగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కేవలం పుష్ప 2 చిత్రంలోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈ పాట ఎప్పటికీ చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.. ఇది అసలు మ్యాటర్.. ఇక పుష్ప 2 నెల దాటినా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు. వరుసగా ఒక్కో రికార్డు ను బ్రేక్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం 1900 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి కొద్ది రోజుల్లో 2000 కోట్లు రాబట్టడం పక్కా అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక జనవరి 10 న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ రాబోతుంది. పుష్ప 2 కు బ్రేక్ పడుతుందేమో చూడాలి..


ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×