E-Paper
Advertisement

OTT Movie : కొత్తగా వచ్చాడు కామ్ గా ఉన్నాడనుకుంటే, చుక్కలు చూపించాడు… ఇదెక్కడి యాక్షన్ మూవీరా మామ.

OTT Movie : కొత్తగా వచ్చాడు కామ్ గా ఉన్నాడనుకుంటే, చుక్కలు చూపించాడు… ఇదెక్కడి యాక్షన్ మూవీరా మామ.
Advertisement

OTT Movie : యాక్షన్ సినిమాలు ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ సినిమాలలో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తి హీరోగా ఉంటే, ఆ సినిమాని చూసి చిన్న పిల్లలు కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు. అటువంటి యాక్షన్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

Advertisement

ఈ హాలీవుడ్ యాక్షన్ మూవీ పేరు ‘ది రోడ్ హౌస్‘ (The Road House). 2024 లో విడుదలైన ఈ అమెరికన్ యాక్షన్ మూవీకి డగ్ లిమాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో జేక్ గిల్లెన్‌హాల్ మాజీ UFC ఫైటర్‌గా నటించారు, హీరో ఫ్లోరిడా రోడ్ హౌస్‌లో బౌన్సర్‌గా ఉద్యోగం చేస్తాడు. జోయెల్ సిల్వర్ నిర్మించిన ఈ మూవీలో డానియేలా మెల్చియర్, బిల్లీ మాగ్నస్సేన్, జెస్సికా విలియమ్స్, జోక్విమ్ డి అల్మెయిడా, జెడి పార్డో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

ఒక క్లబ్ లో కార్టర్ పై బెట్టింగ్ లు వేసుకుంటూ ఆడియన్స్ గోల చేస్తుంటారు. ఎందుకంటే అతడు బాగా బలవంతుడు. రింగులో ఎవరు వచ్చినా మట్టికరిపిస్తుంటాడు. అయితే అక్కడికి హీరో ఫైటింగ్ చేయడానికి వస్తాడు. హీరోని చూసి కార్టర్ ఫైటింగ్ చేయడానికి వెనకడుగు వేస్తాడు. అతనికి తెలుసు హీరోకి ఉన్న పవర్ ఏంటో. ఆర్మీలో ఇటువంటి ఫైట్లు చేసి తన కోపం తగ్గించుకోలేక, ఒక వ్యక్తి ని చంపేసి ఉంటాడు హీరో. ఈ క్రమంలో కార్టర్ దగ్గరికి ఫ్రాంకి అనే మహిళల వస్తుంది. తను రన్ చేసే రెస్టారెంట్ కి రౌడీలా గోల ఎక్కువైంది అంటూ, హెల్ప్ చేయాలని అడుగుతుంది. అందుకు కార్టర్ ఆ పని నాకన్నా అతను బాగా చేయగలడు అంటూ హీరోని చూపిస్తాడు. అయితే హీరోకి తను అనవసరంగా ఒక మనిషిని చంపేశాననే గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఈ క్రమంలో సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోతాడు. ట్రైన్ దగ్గరికి రాగానే ఎందుకనో ఆ ప్రయత్నం విరమించుకుంటాడు. ఆ తర్వాత ఫ్రాంకీ ఉన్న రెస్టారెంట్ కి వెళ్తాడు హీరో.

అక్కడ ఆ రెస్టారెంట్ ను ఖాళీ చేయించడానికి కొంతమంది ఆకతాయిలు బెదిరించడానికి వస్తారు. హీరో వాళ్ళని పచ్చడి చేసి పంపిస్తాడు. ఈ విషయం తెలిసిన ఈ గ్యాంగ్ హెడ్ బెన్ అతన్ని చంపడానికి పథకం వేస్తాడు. ఎందుకంటే రోడ్ హౌస్ రెస్టారెంట్ ని కబ్జా చేసి, డ్రగ్ వ్యాపారం పెంచాలని చూస్తుంటాడు బెన్. హీరో దెబ్బకి ఆ బిజినెస్ చేయలేనేమో అని భయపడతాడు. బెన్ అతని దగ్గరికి మానవ రూపంలో ఉండే, ఒక మృగం లాంటి మనిషిని పంపిస్తాడు. వీరిద్దరి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. ఇందులో హీరో అతన్ని ఓడిస్తాడు. చివరికి హీరోని అంతం చేయాలని బెన్ ఎటువంటి పథకాలు వేస్తాడు? రోడ్ హౌస్ నుంచి హీరో వెళ్లిపోతాడా? బెన్ చేతికి రోడ్ హౌస్ చిక్కుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ‘ది రోడ్ హౌస్’ (The Road House) యాక్షన్ మూవీనీ తప్పకుండా చూడండి.

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×