BigTV English

KTR: ఏసీబీ ముందుకు కేటీఆర్.. గుట్టు విప్పిన అరవింద్‌ కుమార్, ఇక మిగిలింది

KTR: ఏసీబీ ముందుకు కేటీఆర్.. గుట్టు విప్పిన అరవింద్‌ కుమార్, ఇక మిగిలింది

KTR: ఎట్టకేలకు ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ ముందు హాజరవుతున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన అరెస్ట్ ఖాయమనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోందా ? ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు కంగారు పడుతున్నారు? బుధవారం ఏసీబీ విచారణలో ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ గుప్పు విప్పేశారా? అవుననే అంటున్నారు కొందరు అధికారులు.


ఫార్ములా ఈ రేసు కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో తొలిసారి ఏసీబీ ముందుకు హాజరవుతున్నారు కేటీఆర్. దీంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. మీడియాతో మాట్లాడినట్టుగా విచారణలో కేటీఆర్ మాట్లాడుతారా? లేకపోతే  తెలీదు.. మరిచిపోయారు.. గుర్తు లేదని చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదే కేసులో బుధవారం ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను ఏసీబీ దాదాపు ఆరుగంటల పాటు విచారించింది. ఫార్ములా వ్యవహారం తెరపైకి వచ్చిన మొదలు చివరకు అంతా కేటీఆర్ డైరెక్షన్‌లో జరిగిందని తేల్చి చెప్పారట. అందకు సంబంధించిన తనవద్ద నున్న డీటేల్స్ అధికారులకు ఆయన అందజేసినట్టు తెలుస్తోంది. వాటిలో కేటీఆర్‌తో వాట్సాప్‌లో ఛాటింగ్ చేసిన వివరాలు సైతం ఉన్నాయి.


నిధుల విడుదలకు ముందు ఇటు హెచ్ఎండీఏ, అటు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోలేదని తేల్చి చెప్పారట. స్పెషల్ సెక్రటరీగా పరిమితులకు లోబడే తాను విధులు నిర్వహించానని, తన పరిధిలో రూల్స్ ఏమాత్రం అతిక్రమించలేదని తెలిపారు. ప్రభుత్వ జీవోల ఆధారంగా అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రతీది వీడియో రూపంలో రికార్డు చేశారు అధికారులు.

ALSO READ: నో పర్మిషన్.. జస్ట్ చూసేందుకు ఓకే.. కేటీఆర్ విచారణపై హైకోర్టు తీర్పు

అసలు ఈ ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారనే కోణంలో గుచ్చిగుచ్చి ఐఏఎస్‌ను ప్రశ్నించారు అధికారులు. ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ కేటీఆర్ సన్నిహితుడుదని వెల్లడించినట్టు తెలుస్తోంది. స్పాన్సర్ కంపెనీకి నష్టం వస్తుందని చెబుతున్నారని, దీంతో పురపాలకశాఖ ఆ బాధ్యతలు తీసుకోవాలని చెప్పడంతో తాను ఫైల్ రెడీ చేశానని వివరించారు. అదే సమయంలో లీగల్ సమస్యలు వస్తాయని చెప్పినప్పటికీ, అవేమీ పట్టించుకోలేదన్నారు. మళ్లీ అధికారం మనదే అంటూ చెప్పారని వివరించారు.

ఐఏఎస్ అరవింద్ కుమార్ నుంచి రాబట్టిన సమాచారం మేరకు కొత్తగా 40 ప్రశ్నలు రెడీ చేసిందట ఏసీబీ స్పెషల్ టీమ్. ఫార్ములా రేసు ఒప్పందాలు ఏ లెక్కన జరిగాయి? ప్రపంచవ్యాప్తంగా నష్టాలు వస్తున్నాయని తెలిసి, చాలా దేశాలు వెనుకంజ వేశాయి? అప్పటి ప్రభుత్వం ముందుకు రావడానికి కారణమేంటి? ఈ డీల్ వల్ల ఎవరికి లాభం జరిగింది? గ్రీన్ కో తప్పుకోవడం వెనుక కారణమేంటి?

ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీకి నిధులు ఎలా వెళ్లాయి? ఆ శాఖ మంత్రిగా మీరు చెబితేనే చెల్లింపులు చేశామని అధికారులు చెబుతున్నారు? కనిపిస్తున్న డాక్యుమెంట్లకు సమాధానాలేంటి? మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పిన మీరు, ఎన్నికల కోడ్ సమయంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? గ్రీన్ కో యాజమాన్యంతో మీకు ఎప్పటి నుంచి పరిచయాలున్నాయి?

ఫార్ములా రేసు రావడం, మధ్యలో తప్పుకోవడం వెనుక మీడియేటర్ ఎవరు? చేయాల్సింది చేసి అధికారులపై నెపం వేయడం తప్పించుకోవడం కాదా? అనే తరహాలో ప్రశ్నలు రెడీ చేసినట్టు తెలుస్తోంది.  కేటీఆర్ సరైన సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో అదుపులోకి తీసుకునే అవకాశముందని అంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×