BigTV English
Advertisement

NTR: ఆయ్.. ఎన్టీఆర్ బామ్మర్ది చెప్పినట్టే చేశాడండీ.. బావ చేత శభాష్ అనిపించుకున్నాడు

NTR: ఆయ్.. ఎన్టీఆర్ బామ్మర్ది చెప్పినట్టే చేశాడండీ.. బావ చేత శభాష్ అనిపించుకున్నాడు

NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బామ్మర్దిగా నార్నే నితిన్.. మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక మ్యాడ్ తరువాత నితిన్ హీరోగా నటించిన చిత్రం ఆయ్. అంజి మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్ సరసన నయన్ సారిక నటించింది.


స్టార్ హీరోల సినిమాలతో పోటీపడుతూ ఆయ్.. ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమా అయినా కథ మంచిగా ఉండడంతో.. పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టి భారీ విజయాన్ని అందుకుంది. పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న ఆయ్.. రికార్డ్ కలక్షన్స్ కూడా అందుకుంటుంది.

ఇక తాజాగా.. ఈ సినిమాను ఎన్టీఆర్ వీక్షించినట్లు తెలుస్తోంది. సినిమా చూడడమే కాదు.. పర్సనల్ గా ఆయ్ టీమ్ ను ఎన్టీఆర్ కలిసి వారిని అభినందించారు. సినిమా చాలా బావుందని, నితిన్ నటన సూపర్ అని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయ్ ప్రమోషన్స్ లో నితిన్ తాను చెప్పిన మాటను నిలబెట్టుకున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ ను తీసుకొస్తారా.. ? అన్న ప్రశ్నకు నితిన్ సమాధానమిస్తూ.. ” ముందు మీరు సినిమాను హిట్ చేయండి.. తరువాత కచ్చితంగా బావను సక్సెస్ మీట్ కు పిలుస్తాను” అని చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే బావ చేత శభాష్ అనిపించుకున్నాడు.


ఇక ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఎన్టీఆరే స్వయంగా పాల్గొన్నాడు. ఇక త్వరలో సక్సెస్ మీట్ కు గెస్ట్ గా ఆయన వచ్చినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో దేవర అదరగొట్టేశాడు.

ప్రస్తుతం దేవర షూటింగ్ ను ముగించిన ఎన్టీఆర్.. వార్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ సినిమాలో అడుగుపెట్టనున్నాడు. ఈ మధ్యనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసుకున్న విషయం తెల్సిందే. మరి దేవర సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×