E-Paper
Advertisement

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్
Advertisement

OG: ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. తన కెరీర్ లో ఎన్నో కాన్సెప్ట్ బేస్ సినిమాలు చేసి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలద్రోక్కుకున్నాడు. ప్రతి సినిమాకి కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం కరుణ్ కుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను చేస్తున్నాడు వరుణ్. ఈ సినిమాలో మొత్తం మూడు గెటప్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు జరిగింది.

మెగా ఫ్యామిలీ ఫంక్షన్ కి చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హాజరవుతారు. అయితే మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ లో పవర్ స్టార్ పవర్ స్టార్ అనే అరవటం ఎప్పటినుంచో జరుగుతూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వలన. సినిమా అప్డేట్స్ ఏమీ రావడం లేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేయనున్నారు. వీటిలో ఓజీ సినిమా పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. ఇదివరకే సుజిత్ రన్ రాజా రన్ వంటి సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సాహో సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఓజీ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఈ సినిమాను వాస్తవానికి సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాల్లో కూడా ఓ జి సినిమా వస్తుంది చూద్దురుగాని బాగుంటుంది అని చెబుతూ వచ్చారు. మామూలుగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తన సినిమాలు గురించి ఎక్కువగా మాట్లాడరు కానీ ఓజీ సినిమా మీద పవన్ కళ్యాణ్ కూడా మంచి నమ్మకం ఉంది. ఇక రీసెంట్ గా మళ్లీ ఓ జి సినిమా అప్డేట్ గురించి ఫ్యాన్స్ అడిగినప్పుడు కొద్దిపాటి అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇది సనాతన ధర్మం గురించి పెట్టుకున్న సభ కాబట్టి మీరు ఎప్పుడు పెడితే అప్పుడు పవర్ స్టార్ అని అరవకండి సినిమా అప్డేట్స్ అడగకండి అంటూ అభిమానులపై విరుచుకుపడ్డారు. ఇక ఈ సినిమా గురించి వరుణ్ తేజ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఓజి సినిమాకి సంబంధించిన కథను మొదట బాబాయ్ కంటే నేనే విన్నాను. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా అద్భుతంగా ఉండబోతుంది అంటూ భరోసా ఇచ్చాడు వరుణ్ తేజ్. ఓజి సినిమాకి సంబంధించి కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్లో ఉన్నట్లు మట్కా టీజర్ ఈవెంట్లో దర్శకుడు కూడా చెప్పాడు.

ఈ అప్డేట్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపుతుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన “హంగ్రీచిత” సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. అలానే ఓజి అంటే కూడా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అంటూ క్యాప్షన్ కూడా వైరల్ గా మారింది. పంజా సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అంత స్టైలిష్ గా కనిపిస్తున్నారు. స్వతహాగా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ కు ఒక అభిమాని కాబట్టి ఈ సినిమా పైన విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది చిత్ర యూనిట్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×