BigTV English
Advertisement

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Jani Master’s National Award Cancelled: కొరియోగ్రాఫర్ జానీకి మరో షాక్ ఎదురైంది. వచ్చే వారం జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నది. అయితే, ఆయనకు ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డును రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. జానీపై పోక్సో కేసు నమోదై జైలుకు పోవడంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.


Also Read: బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

ఇదిలా ఉంటే.. డ్యాన్సర్ నుంచి డ్యాన్స్ మాస్టర్ గా ఎదిగిన ఇతనికి ఇటీవలే నేషనల్ అవార్డు లభించింది. తాజాగా 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ అవార్డుల్లో జానీకి ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు లభించింది. ప్రముఖ డ్యాన్సర్ సతీష్ కృష్ణన్ మాస్టర్ తో కలిసి సంయుక్తంగా జానీకి ఈ పురస్కారం లభించింది. ధనుశ్, నిత్యామేనన్ జంటగా నటించిన తిరుచిట్రంబళం సినిమాలోని మేఘం కరుకతా అనే పాటకు బెస్ట్ కొరియోగాఫర్ గా అవార్డు లభించింది.


Also Read: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

అయితే, మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న జానీ మాస్టర్ కు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. నేషనల్ అవార్డును అందుకునేందుకు జానీ బెయిల్ కోరారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే, జానీ మాస్టర్ కు వచ్చిన అవార్డును రద్దు చేయాలంటూ పలువురు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ జాతీయ చలనచిత్ర అవార్డును రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అతను అక్టోబర్ 8న ఈ అవార్డును అందుకోవాల్సి ఉంది.. కానీ, అవార్డును రద్దు చేయడంతో ప్రస్తుతం అతని బెయిల్ విషయమై అనిశ్చితి నెలకొని ఉంది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×