BigTV English

OG Teaser : పవన్‌ ‘OG’ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

OG Teaser : పవన్‌ ‘OG’ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

OG Teaser: పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఈ పదవి బాధ్యతలు చేపట్టక ముందు పలు సినిమాలను లైన్‌లో పెట్టారు. అందులో ‘ఓజీ’ మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ముంబై డాన్ పాత్రలో పవర్ స్టార్ కనిపించబోతుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ భారీ అంచనాలు పెంచేశాయి.


ముఖ్యంగా గ్లింప్స్‌లో పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్ సీన్లు హోరెత్తించాయి. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న పవర్ స్టార్.. ఈ సినిమాలో అలాంటి లుక్‌లో కనిపించి అభిమానుల్ని కట్టిపడేశాడు. కత్తులతో తెగనరుకుతూ ఉన్న సీన్లు సినీ ప్రేక్షకుల్లో సరికొత్త జోష్ తెప్పించాయి. ‘‘పదేళ్ల క్రితం బోంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా.. అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ.. వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుఫానూ కడగలేకపోయింది. అలాంటోడు మళ్లీ వస్తున్నాడంటే..’’ అంటూ చెప్పే డైలాగ్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.

Also Read: ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండ్రి.. ఓజీ టైమ్ స్టార్ట్ కాబోతుంది..


ఆ డైలాగ్‌కి థమన్ అందించిన మ్యూజిక్ సినీ ప్రియుల్లో గూస్ బంప్స్ తెప్పించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. డైలాగ్‌కి మ్యూజిక్ సెట్ కావడంతో గ్లింప్స్‌ యూట్యూబ్‌లో భారీ వ్యూస్, లైక్‌లతో పరుగులు పెట్టింది. అందువల్లనే ఈ సినిమా కోసం అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అభిమానులు పవర్ స్టార్‌ను ఎలాంటి అవతార్‌లో చూడాలనుకుంటున్నారో అలా చూపించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. స్టార్ నటీ నటులను ఇందులో భాగం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఇందులో ‘సలార్’ ఫేం శ్రియారెడ్డి, తేజ్ సఫ్రూ, అర్జున్ దాస్‌తో సహా మరికొంత మంది నటీనటులు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ఇందులో పవర్ స్టార్‌ను ఢీ కొట్టే పాత్రలో విలన్‌గా నటిస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి అప్డేట్‌ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికోసం ఓ వార్త బయటకొచ్చి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌కు టైం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంటే సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఓజీ’ మూవీ టీజర్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ వార్తతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×