BigTV English

Real star Srihari: హీరో శ్రీహరి సినిమాలలోకి రాకపోయివుంటే ఏం జరిగుండేది? నేడు ఆయన జయంతి

Real star Srihari: హీరో శ్రీహరి సినిమాలలోకి రాకపోయివుంటే ఏం జరిగుండేది? నేడు ఆయన జయంతి

Tollywood actor Srihari birthday on august 15..Real star: ఎన్నో మరపురాని పాత్రలలో నటించి అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగారు నటుడు శ్రీహరి. కామెడీ, హీరో, క్యారెక్టర్ యాక్టర్ ఇలా ఎలాంటి తరహా పాత్రలైనా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు శ్రీహరి. సినిమాలలోకి రాకముందు మిస్టర్ హైదరాబాద్ గా కండలు తిరిగిన ఛాంపియన్ గా హైదరాబాద్ లో ఏకంగా ఏడు సార్లు అవార్డును అందుకున్నారు. జాతీయ స్థాయిలో అథ్లెట్ గా నిరూపించుకోవాలని అనుకున్నారట. కానీ ఆ కోరిక నెరవేరలేదు. ఆగస్టు 15 శ్రీహరి పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో శ్రీహరి గురించిన విశేషాలు.


ధర్మక్షేత్రంతో ఎంట్రీ

శ్రీహరి 1989 సంవత్సరం బాలకృష్ణ, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా నటించిన ధర్మక్షేత్రం మూవీలో ఒకానొక విలన్ గా నటించాడు.ప్రధాన పాత్ర కాకపోయినా ప్రేక్షకులలో గుర్తింపు పొందాడు. అదే సంవత్సరం రజనీకాంత్ హీరోగా వచ్చిన మా పిళ్లై మూవీలో నటించాడు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన శ్రీహరి ప్రాధమిక విద్య అనంతరం హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. తనకున్న శరీర సౌష్టవంతో సినిమాలలో ముందుగా స్టంట్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు.


గుర్తింపు తెచ్చిన పోలీస్

అవన్నీ పెద్దగా గుర్తింపు తేలేదు. అయితే శ్రీహరిలోని ట్యాలెంట్ ను గుర్తించిన దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు పోలీస్ చిత్రం ద్వారా శ్రీహరిని హీరో చేశారు. ఆ మూవీలో శ్రీహరి చేసిన రియల్ ఫైట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అప్పటినుంచి రియల్ స్టార్ అనే శ్రీహరిని పిలిచేవారు. బిరుదుకు తగ్గట్లు గా శ్రీహరి రియల్ గానే తన పాత్ర కోసం ఎంతగానో శ్రమించేవారు. కొన్ని సార్లు దెబ్బలు కూడా తగిలేవి. అయినా షూటింగ్ కు ఎలాంటి అంతరాయం కలగకూడదని, నిర్మాత శ్రేయస్సు గురించే ఆలోచించేవారు.

విద్యా ట్రస్ట్

శ్రీహరి వ్యక్తిగతంగానూ సాయమందించే గుణం ఉన్న హీరో. ఇండస్ట్రీలో తనకొచ్చే కొద్ది పాటి ఆదాయాన్ని ఓ విద్యా ట్రస్ట్ కు ఖర్చుపెట్టేవారు. ఎందరో అనాథల చదువులకు ఆర్థిక సాయం అందించేవారు. నటి డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. మగధీర చిత్రంలో షేర్ ఖాన్ పాత్రతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ‘మళ్లీ పుడతావురా భైరవా’ అంటూ చెప్పే శ్రీహరి డైలాగ్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించింది. శ్రీహరికి ఆయన గంభీరమైన వాయిస్ ప్లస్ గా మారింది. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాదలుచుకోలేదు శ్రీహరి అందుకే హీరోయిన్ కు అన్న పాత్రలు కూడా శ్రీహరికి కలిసొచ్చాయి. శ్రీహరికి వ్యక్తిగతంగా భద్రాచలం, హనుమంతు సినిమాలు చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టాయి.

అథ్లెట్ అవుదామని..

శ్రీహరి సినిమాలలోకి రాకముందు హైదరాబాద్ లో మిల్క్ బిజినెస్ చేసేవారు.ఒక మెకానిక్ షెడ్డు లో కూడా పనిచేసేవారు. అది తన సొంత అన్నయ్యదే కావడం విశేషం. ఉదయం పూట చదువు, రాత్రి వేళల్లో కష్టపడి పనిచేయడం చేసేవాడు. ఖాళీ దొరికితే జిమ్ కు వెళ్లేవారు. ఏనాటికైనా కష్టపడి భారత దేశం తరపున అథ్లెట్ కావాలని అనుకున్నారు. ఒక వేళ సినిమాలలోకి రాకపోయివుంటే భారత అథ్లెట్ గా మంచి పేరు తెచ్చుకునేవారేమో. 2013 అక్టోబర్ 9న తీవ్రమైన అస్వస్థతతో ముంబాయిలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూశారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×