BigTV English

Pawan Kalyan OG Update: ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండ్రి.. ఓజీ టైమ్ స్టార్ట్ కాబోతుంది..

Pawan Kalyan OG Update: ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండ్రి.. ఓజీ టైమ్ స్టార్ట్ కాబోతుంది..
Advertisement

Pawan Kalyan OG New Poster: 2024 ఏపీ ఎలక్షన్ ఫలితాలు ఇవాళ రిలీజ్ అయ్యాయి. ఈ ఫలితాల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలిపొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ఆయన నటించబోతున్న సినిమాల నుంచి కూడా పలు అప్డేట్‌లు వచ్చిపడుతున్నాయి. అందులో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (Original Gangster) ఒకటి.


యంగ్ అండ్ క్రేజీ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో పవర్ స్టార్ లుక్ ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ గ్లింప్స్‌లో పవర్ స్టార్ మాస్ యాక్షన్ సీన్లు అబ్బో ఇక చెప్పాల్సిన పనే లేదు.

ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇవాళ ఎన్నికల ఫలితాలలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీ ఓట్లతో విజయం సాధించడంతో పవన్ అభిమానులకు మూవీ టీం అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఇందులో భాగంగా ఈ మూవీ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా ‘‘ఎవరికీ అందదు అతని రేంజ్.. రెప్ప తెరిచెను రగిలే రివేంజ్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. ‘‘ ఓజీ టైమ్ ప్రారంభమవుతుంది’’ అంటూ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.


Also Read: పవన్ కల్యాణ్ ‘ఓజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్ ఫస్ట్ లుక్ మామూలుగా లేదు భయ్యా!

ఈ పోస్టర్‌లో పవర్ స్టార్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. కుర్చీపై కూర్చుని కాళుపై కాళు వేసుకుని ఉన్న స్టిల్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీలో ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రియారెడ్డి, తేజ్ సప్రూ, అర్జున్ దాస్‌తో సహా మరికొంత మంది నటీ నటులు ఇందులో భాగం అయ్యారు. అంతేకాకుండా ఇందులో విలన్‌గా ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ నటిస్తున్నాడు. ఎన్నో సినిమాల్లో తన యాక్టింగ్‌తో అదరగొట్టిన నటుడు ఇమ్రాన్ హష్మీ ఓజీ సినిమాలో పవన్‌ను ఢీ కొట్టే పాత్రలో నటిస్తున్నాడు. దీంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. మొత్తంగా దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఓ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడనే చెప్పాలి.

Related News

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Big Stories

×