BigTV English

Om Bheem Bush on OTT: అదేంటి.. హిట్ సినిమా.. అప్పుడే ఓటిటీలోనా.. ?

Om Bheem Bush on OTT: అదేంటి.. హిట్ సినిమా.. అప్పుడే ఓటిటీలోనా.. ?
Om Bheem Bush OTT Release Date
Om Bheem Bush OTT Release Date

Om Bheem Bush Movie Streaming on March 22 in Prime Videos: ఈ మధ్యకాలంలో సినిమాలు ఓటిటీలో వస్తున్నాయా..? థియేటర్ లో వస్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్లాప్ సినిమా త్వరగా ఓటిటీకి వస్తుంది అంటే పర్లేదు.. కానీ, హిట్ సినిమాలు కూడా మూడు వారాలు తిరక్కుండానే ఓటిటీలో కనిపించడంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు. ఇంత త్వరగా ఓటిటీకి వస్తుంది అని తెలిస్తే థియేటర్ కు వెళ్లేవాళ్లం కాదు అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.


అసలు ఇప్పుడు ఏ సినిమా గురించి ఈ చర్చ అంటే.. మూడువారాల క్రితమే రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఓం భీమ్ బుష్ సినిమా గురించి. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించాడు. మార్చి 22 న ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యింది. ఎలాంటి లాజిక్స్ లేకుండా హాయిగా మూడు గంటలు నవ్వుకోవచ్చు అని మేకర్స్ ముందునుంచే చెప్పడంతో ప్రేక్షకులు సైతం ఎలాంటి లాజిక్స్ వెతక్కుండా సినిమా చూసి ఎంజాయ్ చేశారు.

Also Read: RT75: రవన్న దావత్ కు రెడీ అయిపొండ్రి..


ఇక మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ సినిమా ముచ్చటగా మూడు వారాలు కూడా నిండకుండా ఓటిటీ బాట పట్టింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఏప్రిల్ 12 న ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అదేంటి.. హిట్ సినిమా.. అప్పుడే ఓటిటీలోనా ..? అంటూ ప్రేక్షకులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఓటిటీ ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×