BigTV English

Ravi Teja75: రవన్న దావత్ కు రెడీ అయిపొండ్రి..

Ravi Teja75: రవన్న దావత్ కు రెడీ అయిపొండ్రి..
RT75
RT75

Mass Maha Raja Ravi Teja 75th Movie Update: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంది. ప్రస్తుతం రవితేజ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజా.. మరో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించాడు. టిల్లు స్క్వేర్ తో హిట్ అందుకున్న నిర్మాణ సంస్థలు సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.


నేడు ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ ప్రకటించారు. RT75 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో భాను భోగవరపు డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. మాస్ మహారాజా క్యారెక్టర్ కు తగ్గట్టు ఎంతో మాస్ గా, కామెడీగా ఈ పోస్టర్ ను రూపొందించారు.

గాగుల్స్ మీద RT75 అని రాసి.. దానికింద.. రాశిఫలాలను రాసుకొచ్చారు. పేరు.. లక్ష్మణ్ భేరి. ఆదాయం.. చెప్పన్ తీయ్. రాజ్యపూజ్యం..అన్ లిమిటెడ్. వ్యయం.. లెక్క జేయన్ అని రాసుకొచ్చారు. దీంతో ఈ సినిమా ఫుల్ మాస్ మహారాజా కామెడీతో అదిరిపోతోందని తెలుస్తోంది. ఇక పైన రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయ్యిపొండ్రి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. మరి రవితేజ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


Also Read: Devara: బ్రేకింగ్.. ధర్మ ప్రొడక్షన్స్ చేతికి దేవర

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×