BigTV English

Ooru Peru Bhairava Kona : ‘మా తప్పు లేదు’.. రవితేజతో సందీప్ కిషన్ ఢీ!

Ooru Peru Bhairava Kona | సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవ కోన’. ఈ సినిమా హారర్ ఫాంటసీ కథాంశంతో రూపొందింది. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా గ్యాప్ తరువాత సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ఇది. సంక్రాంతికి తమిళంలో ధనుష్ హీరోగా విడుదలైన కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ సపోర్టింట్ రోల్ చేశాడు.

Ooru Peru Bhairava Kona : ‘మా తప్పు లేదు’.. రవితేజతో సందీప్ కిషన్ ఢీ!
Tollywood news in telugu

Ooru Peru Bhairava Kona update(Tollywood news in telugu):


సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవ కోన’. ఈ సినిమా హారర్ ఫాంటసీ కథాంశంతో రూపొందింది. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా గ్యాప్ తరువాత సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ఇది. సంక్రాంతికి తమిళంలో ధనుష్ హీరోగా విడుదలైన కెప్టెన్ మిల్లర్ సినిమాలో సందీప్ కిషన్ సపోర్టింట్ రోల్ చేశాడు.

అయితే ఇప్పుడు సందీప్ కిషన్ హీరోగా ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమా రిలీజ్ విషయంలో చిన్న గొడవ జరుగుతోంది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన హీరో రవితేజ సినిమా ‘ఈగల్’ ఫిబ్రవరి 9న విడుదల అవుతోంది. సంక్రాంతి బరిలో నుంచి తప్పుకునేందుకు ఒప్పుకున్న ఈగల్ సినిమా ప్రొడ్యూసర్స్ .. నిర్మాతల మండలిలో ఒక షరతు విధించారు. సంక్రాంతి నుంచి తప్పుకుంటే ఫిబ్రవరి 9న తమకు సోలో రిలీజ్ ఇవ్వాలని. అయితే ఫిబ్రవరి 9న డిజే టిల్లు సీక్వెల్ ‘టిల్లు స్వేర్’ విడుదల కానుంది. ఆ సినిమాను వాయిదా వేసేందుకు నిర్మాత నాగవంశీ ఒప్పుకున్నారు. కారణం సంక్రాంతికి విడుదలైన సినిమాలలో గుంటూరు కారం సినిమా ఉండడం. ఆ సినిమాకు కూడా నాగవంశీ నిర్మాత.


అంతా బాగుందనుకున్నారంతా.. అయితే ఇటీవల ‘ఊరు పేరు భైరవ కోన’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్‌ని ఈగల్ సినిమా సోలో రిలీజ్ గురించి మీడియా ప్రశ్నించింది. దానికి సమాధానిమిస్తూ.. అందరి కంటే ముందు తాము ఫిబ్రవరి 9 రిలీజ్ డేట్ ప్రకటించామని చెప్పారు. నిర్మాతల మండలి ఈగల్‌కు సోలో రిలీజ్ డేట్ కోసం అంగీకరించే ముందు తమను ఒకసారి కూడా సంప్రదించలేదని అన్నారు. ఇప్పుడు తమ సినిమా రిలీజ్ ముందుకు వెనక్కు జరపలేని పరిస్థితి ఉందని.. కాబట్టి ఫిబ్రవరి 9న క్లాష్ తప్పదని స్పష్టం చేశారు.

అయితే అదే రోజు మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’, ఆంధ్ర పొలిటికల్ డ్రామా ‘యాత్ర 2’ ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ ఉంటే తప్పుకున్న రవితేజ ‘ఈగల్’ ఫిబ్రవరి 9న కూడా అంతే పోటీ ఎదుర్కొబోతోంది.

Ooru Peru Bhairava Kona

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×