E-Paper
Advertisement

Natu Natu Song : చరిత్ర సృష్టించిన RRR.. ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు..

Natu Natu Song : చరిత్ర సృష్టించిన RRR.. ‘నాటు నాటు’ సాంగ్ కు ఆస్కార్ అవార్డు..
Advertisement

Natu Natu Song : 2023 ఆస్కార్‌ అవార్డుల వేడుకలో RRR మూవీ దుమ్మురేపింది. కోట్లాది మంది భారతీయులను ఆనందంలో ముంచెత్తింది. ‘నాటు నాట..’ పాట ఆస్కార్ అవార్డు కైవసం చేసుకుంది. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది.

బెస్ట్‌ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడిన ‘అప్లాజ్‌’ (టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌), ‘లిఫ్ట్‌ మి అప్‌’ (బ్లాక్‌ పాంథర్‌: వకాండా ఫెరవర్‌), దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌ మావెరిక్‌) పాటలను వెనక్కి నెట్టి ‘నాటు నాటు..’ ఆస్కార్‌ దక్కించుకుంది.

Advertisement

బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ కు అవార్డు ప్రకటించగానే డాల్బీ థియేటర్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. ఆస్కార్‌ అవార్డును అందుకున్న ‘ఆర్ఆర్ఆర్‌’ టీమ్‌ ఆనందోత్సాహల్లో మునిగిపోయింది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. నాటు నాటు పాటను చంద్రబోస్ రాశారు. ఈ సాంగ్ ను గాయకులు కాలబైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు డాన్స్ మాస్టర్. అవార్డు ప్రకటించడానికి ముందు ఈ వేడుకలో బాలీవుడ్‌ కథానాయిక దీపిక పదుకొణె స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటను ఆమె ఆస్కార్‌ వేడుకలో పరిచయం చేశారు. ఆ పాట నేపథ్యాన్ని వేడుకకు హాజరైన వారికి వివరించారు.

Advertisement

ఆస్కార్ వేదికపై గాయకులు కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లైవ్‌లో నాటు నాటు పాట పాడారు. అదే సమయంలో వెస్ట్రన్‌ డ్యాన్సర్స్ తమ డ్యాన్స్‌తో ఉర్రూతలూగించారు. ఇలా ‘నాటు నాటు’ను ఆస్కార్‌ వేదికగా ప్రదర్శించారు. ఈ పాట ప్రదర్శించినప్పుడు డాల్బీ థియేటర్‌ చప్పట్లతో దద్దరిల్లిపోయింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×