E-Paper
Advertisement

మీ కండరాలు త్వరగా ముసలిబారుతున్నాయా? ఇంట్లోనే ఈ మూడు పరీక్షలు చేసి తెలుసుకోండి

మీ కండరాలు త్వరగా ముసలిబారుతున్నాయా? ఇంట్లోనే ఈ మూడు పరీక్షలు చేసి తెలుసుకోండి
Advertisement

Muscle Health Test| వయసు పెరుగుతోందని వృద్ధాప్యం వస్తోందని మనకు అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే ముడతలను చూస్తే తెలుస్తుంది. అంతేకాదు మన శరీరంలోని కండరాలు కూడా వృద్ధాప్య లక్షణాలు తెలియజేస్తాయి. కండరాల బలం తగ్గితే నడవడం, మెట్లు ఎక్కడం, కుర్చీలో నుంచి లేవడం కూడా కష్టంగా మారవచ్చు. అయితే మీ కండరాలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో తెలుసుకోవడానికి జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే కేవలం నిమిషంలో మూడు సులభమైన పరీక్షలు చేసుకోవచ్చు. డాక్టర్ విశాఖ సూచించిన ఈ పరీక్షలు మీ కండరాల బలం, కదలికలు, శారీరక ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాయి.

1. గ్రిప్ స్ట్రెంగ్త్ పరీక్ష

చేతులతో వస్తువులను గట్టిగా పట్టుకునే సామర్థ్యాన్ని గ్రిప్ స్ట్రెంగ్త్ అంటారు. ఇది మొత్తం కండరాల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే సూచిక. వైద్యులు సాధారణంగా డైనమోమీటర్ అనే పరికరంతో దీనిని కొలుస్తారు. ఇంట్లోనే పరీక్షించుకోవడానికి డాక్టర్ విశాఖ ఒక సులభమైన పద్ధతిని సూచిస్తున్నారు. బలంగా ఉన్న పైపును లేదా హ్యాంగింగ్ బార్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి. పాదాలు నేలకు తగలకుండా శరీరాన్ని కొద్దిసేపు వేలాడదీయాలి. ఎంతసేపు పట్టుకోగలుగుతున్నారో గమనించాలి. చేతుల పట్టు బలహీనంగా ఉంటే కండరాల బలం తగ్గుతున్నట్లు సూచించవచ్చు. అయితే ఇది పూర్తి స్థాయి వైద్య పరీక్షకు ప్రత్యామ్నాయం కాదు.

2. సిట్ టు స్టాండ్ పరీక్ష

Advertisement

ఈ పరీక్ష ద్వారా కాళ్ల కండరాల బలాన్ని అంచనా వేయవచ్చు. ఇందుకోసం ఒక కుర్చీ మాత్రమే అవసరం. ముందుగా కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. తర్వాత చేతుల సహాయం తీసుకోకుండా ఐదుసార్లు లేవాలి, తిరిగి కూర్చోవాలి. ఈ ప్రక్రియను సురక్షితంగా చేయాలి. డాక్టర్ సూచనల ప్రకారం.. ఈ 5 కదలికలను 12 నుంచి 15 సెకన్లలో పూర్తి చేయడం లక్ష్యం. ఎక్కువ సమయం తీసుకుంటే కాళ్ల కండరాల బలం తగ్గుతున్నట్లు సూచించవచ్చు. కండరాల బలహీనత వల్ల పడిపోయే ప్రమాదం కూడా పెరగవచ్చు.

Also Read: తగ్గేదెలే.. ఈ 5 రాశుల్లో పుట్టినవారు చివరి నిమిషం దాకా పోరాడుతారు

3. వాకింగ్ స్పీడ్ పరీక్ష

Advertisement

నడక వేగం కూడా కండరాల ఆరోగ్యాన్ని తెలియజేసే ముఖ్యమైన అంశం. మెదడు, నరాలు, కాళ్ల కండరాలు ఎంత సమన్వయంతో పనిచేస్తున్నాయో ఇది సూచిస్తుంది. ముందుగా ఎనిమిది మీటర్ల దూరాన్ని కొలవాలి. తర్వాత సాధారణ వేగంతో నడవాలి. ఈ దూరాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుందో గమనించాలి. డాక్టర్ విశాఖ ప్రకారం.. 12 సెకన్లలోపు ఈ దూరాన్ని నడవడం లక్ష్యంగా పెట్టుకోవాలి. నెమ్మదిగా నడవడం కండరాల బలహీనత లేదా కదలికల సమస్యలకు సంకేతం కావచ్చు.

Also Read: ఒక్కసారిగా చెడు వార్త వింటే గుండెపోటు వస్తుందా? డాక్టర్ ఏం చెప్పారంటే

వయసు పెరిగినా కండరాలను బలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి?

కండరాల ఆరోగ్యానికి వ్యాయామం, పోషకాహారం చాలా అవసరం. ప్రతిరోజూ తగిన శారీరక శ్రమ చేయాలి. వెయిట్ లిఫ్టింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలు కండరాల బలాన్ని కాపాడతాయి. ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, పప్పులు, బీన్స్, పనీర్ తీసుకోవాలి. ఎముకలు, కండరాల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి కూడా అవసరం. రోజంతా తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు.

గమనిక

ఈ పరీక్షలు కేవలం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. వీటితో వ్యాధులను నిర్ధారించలేము. ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.

Related News

నోట్లో వేయగానే కరిగిపోయే క్రిస్పీ ఫిష్ అమృత్‌సరి.. ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా ఇలా చేసుకోండి!

చికెన్ కీమా పరోటా ఇలా చేసుకుని తిన్నారంటే.. టేస్ట్ వేరే లెవెల్ అంతే!

హోటల్ స్టైల్ పూరీ కర్రీ..ఇంట్లోనే పక్కా కొలతలతో ఇలా చేయండి!

పక్కా కొలతలతో అదిరిపోయే టమాటో పచ్చడి..ఎన్ని రోజులైనా టేస్ట్ మారదు!

దీపావళికి ఇంటి టెర్రస్‌పై పార్టీ ఐడియా అదుర్స్.. ఈ విధంగా డెకరేషన్ చేయండి

30 ఏళ్లు దాటాక చేతులు, కాళ్ల చర్మంపై ముడతలు కనిపిస్తున్నాయా? ఈ 4 చిట్కాలు పాటించండి

మాట్లాడేటప్పుడు కళ్లు పక్కకు తిప్పడం బలహీనత కాదా? సైకాలజీ చెప్తున్న అసలు నిజమిదే!

Big Stories

Advertisement
×