PCB Action On Azhar Mahmood and Waqar Younis: పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో (Pakistan Cricket Board) ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Afghanistan Premier League 2026 Tournament) పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ టోర్నమెంట్ లో ఎవరు పాల్గొనకూడదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందే హెచ్చరించినప్పటికీ.. మాజీ క్రికెటర్లు అజార్ మహమూద్ ( Azhar Mahmood) వకార్ యూనిస్ ( Waqar Younis) ఇద్దరు రూల్స్ బ్రేక్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లపై యాక్షన్ తీసుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రంగం సిద్ధం చేసింది. ఈ మాజీ క్రికెటర్లు అజార్ మహమూద్, వకార్ యూనిస్ భవిష్యత్తులో పాకిస్తాన్ లో ఎలాంటి కోచింగ్, కామెంట్రీ పదవులు చేయకుండా గెజిట్ జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్ట్ జరగగా… ఆ మెగా ఈవెంట్ లో ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అజార్ మహమూద్, వకార్ యూనిస్ పాల్గొన్నారు. అంతేకాదు, ఆఫ్ఘాన్ క్రికెటర్ రహ్మానుల్లాహ్ గుర్బాజ్ పక్కనే కూర్చొని అడ్డంగా బుక్కయ్యారు. దీంతో వీళ్ళ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ విషయం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ దాకా వెళ్ళిందని సమాచారం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఆదేశాల మేరకు చర్యలకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రంగం సిద్ధం చేసినట్టు ప్రచారం సాగుతోంది.
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాళిబన్ల మధ్య చాలా రోజులు నుంచి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ బాంబులు వేయడం… అటు ఇండియా సహాయంతో పాకిస్తాన్ పైన ఆఫ్గనిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంది. దీంతో రెండు దేశాల మధ్య నిత్యం యుద్ధ వాతావరణం నెలకొంటోంది. క్రికెట్ పరంగా కూడా రెండు బోర్డుల మధ్య దూరం పెరిగింది. అందుకే ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ డ్రాఫ్టులో ఎవరు పాల్గొనకూడదని పాకిస్తాన్ ప్లేయర్లకు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు అజార్ మహమూద్, వకార్ యూనిస్ డ్రాఫ్ట్ లో పాల్గొని అడ్డంగా దొరికిపోయారు. దీంతో చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అయితే, ఈ వార్త బయటకు రావడంతో ఇద్దరిపై పాకిస్తాన్ అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అజార్ మహమూద్, వకార్ యూనిస్ లను దేశ ద్రోహులుగా ప్రకటించి, పాకిస్తాన్ నుంచి వెళ్లగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు.