E-Paper
Advertisement

Oscar Awards: ఇప్పటి వరకు ఆస్కార్ అందుకున్న భారతీయులు వీరే..

Oscar Awards: ఇప్పటి వరకు ఆస్కార్ అందుకున్న భారతీయులు వీరే..
Advertisement

Oscar Awards: ఆస్కార్.. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి జీవిత ఆశయం. ఈ పురస్కారాన్ని పొందడం కోసం ఎంతగానో శ్రమిస్తుంటారు. ఇక మార్చి 31న అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో 95వ ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎంత మంది భారీయులు ఈ అవార్డును అందుకున్నారో చూద్దాం..

భాను అథైమా.. భారత్ నుంచి మొట్టమొదటిసారి ఆస్కార్ అందుకున్న నటి. 1982లో వచ్చి గాంధీ సినిమాకిగానూ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. 1983లో నిర్వహించిన 55వ ఆస్కార్ వేడుకల్లో అవార్డును స్వీకరించారు. భారత్ నుంచి ఆస్కార్ అందుకున్న తొలి నటిగా భాను అథైమా చరిత్రలో నిలిచిపోయారు.

Advertisement

ఆ తర్వాత దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే ఈ అవార్డును అందుకున్నారు. ఇండస్ట్రీకీ ఆయన చేసిన సేవకు గానూ 1992లో ఆనరరీ అవార్డును అందుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా వేడుకల్లో పాల్గొనలేకపోవడంతో.. నిర్వాహకులు ఆయన చికిత్స పొందుతున్న కోల్‌కత్తాలోని ఆసుపత్రికి వచ్చి అవార్డును అందజేశారు. ఆనరరీ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు సత్యజిత్ రే.

ఆ తర్వాత దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్‌కు ఆస్కార్ పురస్కారాలు అందాయి. ఈ సారి ఏకంగా మూడు పురస్కారాలు వచ్చాయి. అది కూడా ఒకే సినిమా స్లమ్‌డాగ్ మిలీనియర్‌కి. బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఇలా మూడు విభాగాల్లో ఈ సినిమాకు మూడు ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

Advertisement

ఇందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోరో విభాగాల్లో సంగీతం దిగ్గజం ఎ.ఆర్. రెహమాన్ రెండు అవార్డులను అందుకున్నారు. బెస్ట్ సౌండింగ్ మిక్స్ కేటగిరీలో రసూల్ పూకుట్టి ఆస్కార్ సాధించాడు.

అలాగే 2019లో పీరియడ్ ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్‌ ఉత్తమ డాక్యుమెంటరీగా ఆస్కార్ పురస్కారం అందుకుంది. ఢిల్లీకి చెందిన నిర్మాత గునీత్ మోన్గా దీనిని నిర్మించారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×