E-Paper
Advertisement

Meghalaya : మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణం.. మోదీ, అమిత్ షా హాజరు..

Meghalaya : మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణం.. మోదీ, అమిత్ షా హాజరు..
Advertisement

Meghalaya : మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత కాన్రాడ్‌ .కె. సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఫాగు చౌహన్‌.. సంగ్మా చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అస్సోమ్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.

మేఘాలయాలో 11 మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు. సంగ్మా కేబినెట్ లో ఎన్‌పీపీకి చెందిన ఏడుగురు, యూడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ, హెచ్‌ఎస్‌పీడీపీ నుంచి ఒకొక్కరికి స్థానం దక్కింది.

Advertisement

ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌పీపీ 26 సీట్ల గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ మాత్రం లభించలేదు. దీంతో బీజేపీ, యూడీపీ, ఇతర పార్టీలతో కలిసి కాన్రాడ్‌ సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఆయన మేఘాలయ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.

సోమవారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్‌ తిమోతి షిరా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ స్పీకర్‌ను మార్చి 9న ప్రత్యేక హౌస్‌లో సెషన్‌లో ఎన్నుకునే అవకాశం ఉంది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×