Suriya 46 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య భారీ బడ్జెట్ తో సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. గతంలో వచ్చిన కంగువా చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేసిందని అందరూ ఊహించారు. స్టోరీ యావరేజ్గా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే డీలా అయిపోయింది. ఇక అది అన్ని జాగ్రత్తలు తీసుకున్న సూర్య రెట్రో మూవీతో ప్రేక్షకులను పలకరించారు.. ఇటీవల రిలీస్ అయినా ఈ సినిమా మంచి టాక్ ని అందుకోవడంతోపాటుగా కలెక్షన్ల పరంగా చూస్తే దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తున్నాడు. ఆ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. మరి ఆ బిజినెస్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
సూర్య 46 మూవీ ఓటీటీ రైట్స్..?
తమిళ స్టార్ హీరో సూర్య,వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా విడుదలకు ముందే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటోంది. ‘సూర్య 46’గా ప్రస్తుతానికి పిలుస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఓటీటీ సంస్థ దిమ్మతిరిగే ధరకు డీల్ కట్టేసింది. థియేట్రికల్ రిలీజ్‌కి ముందే రూ.85 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెట్రో తర్వాత సూర్య నేరుగా తెలుగులో వస్తున్న మొదటి మూవీ ఇదే కావడం విశేషం. ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. తెలుగులో డైరెక్ట్ గా సూర్య చేస్తున్న మొదటి మూవీ ఇదే. అందుకే తెలుగు ఆడియన్స్ థియేటర్లలో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు..
Also Read : రేవంత్ రెడ్డి అవార్డు గెలిచిన పుష్పరాజ్.. సీఏం రూటే సపరేటు..
ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. టాలీవుడ్ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ దేవరకొండ మూవీ కోసం ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసినట్లు మరో టాక్ నడుస్తోంది. సూర్యకి ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్టుపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.. తెలుగు లో సూర్య నటినస్తున్న మొదటి మూవీ. స్టార్ హీరో కావడంతో స్టోరీ పై నమ్మకం కూడా ఉందని ఆయన నమ్ముతున్నాడు.. అయితే ఇప్పటివరకు ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చెయ్యలేదు. సూర్య 46 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. మరి ఎలాంటి టైటిల్ తో వస్తుందో తెలుసుకోవాలని ఆయన ఫ్యాన్స్ చూస్తున్నారు. తెలుగులో ఇదే మొదటి మూవీ.. సూర్య లైఫ్ ను ఎలా టర్న్ చేస్తుందో చూడాలి.. ఆ తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్టు లలో నటిస్తున్నాడు. ఏది ఏమైనా సూర్య రెట్రో మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు.