ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. వాటిని భద్రంగా ఉంచుకునేందుకు టెంపర్డ్ గ్లాస్ వేయించుకుంటారు. కిందపడ్డా సేఫ్ గా ఉండేందుకు పౌచ్ వేసుకుంటారు. వీటి కోసం రూ. 100 నుంచి రూ. 150 వరకు ఖర్చు చేస్తారు. నిజానికి వీటిని ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ రియల్ మీ వినియోగదారులు
ఒకవేళ మీరు రియల్ మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే, ప్రతి నెల మూడో శనివారం మీకు దగ్గర లోని సర్వీస్ సెంటర్ కు వెళ్లండి. టెంపర్ గ్లాస్, పౌచ్ ఆఫర్ చెయ్యలేదు. కానీ, ఇంటర్నల్ సర్వీస్ క్లీనింగ్ తో పాటు ఓఎస్ అప్ డేట్ ఫ్రీగా చేస్తారు. కొన్ని సర్వీసులు మీద లేబర్ ఛార్జీలు తీసుకోరు.
⦿ ఒప్పో వినియోగదారులు
ఒప్పో స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు అయితే, ప్రతి నెల 10 లేదంటే 12వ తేదీ మధ్యలో మీ దగ్గరల్లోని సర్వీస్ సెంటర్ కు వెళ్లండి. మీకు బ్యాక్ ప్యానెల్ తో పాటు అడిషనల్ గా ఓఎస్ ఆప్ గ్రేడ్ ని కూడా ఫ్రీగా చేసి ఇస్తారు.
⦿ వీవో, ఐకూ వినియోగదారులు
ఒకవేళ మీరు వీవో, ఐకూ స్మార్ట్ ఫోన్లు వాడితే, ప్రతి నెల 14 – 16 మధ్యలో మీకు దగ్గరలోని సర్వీస్ సెంట్ కు వెళ్లండి. ఫ్రీ గా సర్వీస్ చేయడంతో పాటు స్క్రీన్ గార్డ్, పౌచ్ ఫ్రీగా అందిస్తారు.
⦿ శామ్ సంగ్, వన్ ప్లస్ వినియోగదారులు
ఒకవేళ మీరు శామ్ సంగ్ వినియోగదారులు అయితే, ఎస్20 నుంచి ఎస్22 వరకు OLEDలో గ్రీన్ లైన్స్ ఇష్యూ వస్తే ఒకారి ఉచితంగా డిస్ ప్లే రీప్లేస్ చేస్తారు. వారెంటీ లేకపోయినా చేస్తారు. మీరు వన్ ప్లస్ వినియోగదారులు అయితే, మీ స్మార్ట్ ఫోన్ 8, 8T, 9, 9R యూజ్ చేస్తున్నట్లు అయితే, గ్రీన్ లైన్స్ సమస్యలు వస్తే, లైఫ్ టైమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో డిస్ ప్లే రీప్లేస్ చేస్తారు. అయితే, ఒక్కసారి మాత్రమే.
Read Also: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?
⦿ ఐఫోన్ వినియోగదారులకు నో ఫ్రీ
మీరు యాపిల్ ఐఫోన్ వినియోగదారులు అయితే, మీకు ఏదీ ఫ్రీగా రాదు. ప్రతిదీ కొనుక్కోవాల్సిందే. 8.5 వేలు పెట్టి ఆపిల్ కేర్ ప్లస్ తీసుకున్నా, డబ్బులు పెట్టి సర్వీస్ చేయించుకోవాల్సిందే. ఇందులో మీరు ఏ మోబైల్ వాడుతున్నారో? దాన్ని బట్టి ఈ ఆఫర్లు పొందే ప్రయత్నం చేయండి.
Read Also: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?