Revanth Vs Allu Arjun: గొడవలు ఎవరికైనా ఉంటాయి.. డబ్బులు విషయంలో కొందరు గట్టిగా ఉంటారు. మరి కొందరు మాత్రం పరువు మర్యాదలు అంటూ ఫ్రాకులాడుతూ ఉంటారు. ఇటీవల కొన్ని సంఘటనలు చూస్తే ఎంత చేసినా తప్పే అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామని డౌట్ చాలా మందికి రావచ్చు. అందుకు కారణం కూడా ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నా కూడా వారి ప్రతిభను గుర్తించడంలో మాత్రం వెనకడుగు వేయరు అని మరోసారి నిరూపించారు. గత ఏడాదిలో పుష్ప 2 సినిమా రిలీజ్ టైం లో తొక్కిసలాట జరగడంతో ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు ఇంకా ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వడంలో మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా తెలంగాణలో గద్దర్ అవార్డుల బహుకరణ జరుగుతుంది. అల్లు అర్జున్ కు అవార్డు వరించింది.. అల్లు అర్జున్ కి అవార్డు రావడంతో తెలంగాణ ప్రభుత్వంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు..
తెలంగాణాలో గద్దర్ అవార్డులు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో చిన్న చూపు చూసింది. నంది అవార్డులను సింహా అవార్డులు చేశారు. అవార్డులను ఇస్తామని ఎప్పుడో తెలంగాణ సర్కార్ ప్రకటించింది కానీ ఆ తర్వాత చడి చప్పుడు లేకుండా ఉండిపోయారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లకు తెలంగాణలో అవార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొలువైన తర్వాత ప్రజా గాయకుడు గద్దర పేరిట తెలుగు సినీ రంగానికి అవార్డులు ఇస్తానని ప్రకటించడమే కాకుండా.. దిల్ రాజు, జయసుధ నేతృత్వంలో గద్దర్ అవార్డుల కమిటీని ఏర్పాటు చేసింది..
Also Read :మరోసారి అడ్డంగా బుక్కయిన రష్మిక.. ఇదిగో ప్రూఫ్…
అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు..
ఈ ఏడాది గద్దర్ అవార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. 2024 నుంచి గద్దర్ సినీ అవార్డులను ప్రకటించడం విశేషం. అందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ను ఎంపిక చేసింది. మొత్తంగా నటన నటనే.. చట్టం చట్టమే అన్నట్టుగా పుష్ప 2లో అల్లు అర్జున్ చేసిన అద్భుత నటనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న తొలి ఉత్తమ నటుడి అవార్డును బన్ని ఇవ్వడం విశేషం.. అయితే గద్దర్ అవార్డులను ఇచ్చేందుకు ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్కి బెస్ట్ అవార్డు రావడంతో ఆయన అభిమానులు రేవంత్ రెడ్డి సర్కార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే జూన్ 12న రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ఈ అవార్డు కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది.. మరి ఈ అవార్డులపై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారో చూడాలి..