BigTV English

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

NIACL: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ గుడ్ న్యూస్. ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన భారీ వేతనం కూడా ఉంటుంది. డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంటెక్‌ లేదా ఎంబీఏ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం తదితర వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్ఐఏసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 550 అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 550


ది న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  ఇందులో రిస్క్ ఇంజినీర్స్, ఆటో మొబైల్ ఇంజినీర్స్, లీగల్ స్పెషలిస్ట్స్, అకౌంట్స్ స్పెషలిస్ట్స్, ఐటీ స్పెషలిస్ట్, తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు: 

 రిస్క్‌ ఇంజినీర్స్‌: 50
అటోమొబైల్‌ ఇంజినీర్స్‌: 75
 లీగల్‌ స్పెషలిస్ట్స్‌: 50
 అకౌంట్స్‌ స్పెషలిస్ట్స్‌: 25
 ఏఓ(హెల్త్‌): 50
 ఐటీ స్పెషలిస్ట్స్‌: 25
 బిజినెస్‌ అనలిస్ట్స్‌: 75
 కంపెనీ సెక్రటరీ: 02
 ఆక్చ్యూరియల్‌ స్పెషలిస్ట్స్‌: 05
జనరలిస్ట్స్‌: 193

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ లేదా ఎంబీఏ, ఎంబీబీఎస్‌ లేదా బీడీఎస్‌/ఎండీఎస్‌ లేదా బీఏఎంఎస్‌/బీహెచ్‌ఎంఎస్‌ పాసై ఉండాలి. 55 నుంచి 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.50,925  నుంచి రూ.96,765 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు…

దరఖాస్తుకు ప్రారంభ తేది: ఆగస్టు 7

దరఖాస్తుకు  చివరి తేది: ఆగస్టు 30

ఎగ్జామ్ డేట్స్: 

ప్రిలిమ్స్: 2025 సెప్టెంబర్ 14

మెయిన్స్: 2025 అక్టోబర్ 29

దరఖాస్తు ఫీజు: రూ.850 పే చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఎగ్జామ్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://newindia.co.in/

అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/niacljul25/

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం వెకెన్సీల సంఖ్య: 500

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30

జీతం: నెలకు రూ.50,925  నుంచి రూ.96,765

అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: రూ.18 లక్షలతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలివే..

Related News

APSRTC: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలు ఇదిగో..

BEL Recruitment: బెల్‌ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. మంచి వేతనం, ఈ అర్హత ఉంటే జాబ్..!

Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు

Group-II Notification: ఏపీ గ్రూప్-2 నోటిఫికేషన్ రద్దుపై తీర్పు రిజర్వ్

BANK OF MAHARASHTRA: డిగ్రీ, బీటెక్ అర్హతలతో భారీగా కొలువులు.. ఈ జాబ్ వస్తే రూ.1,40,500 జీతం, డోంట్ మిస్

DSSSB: పది అర్హతతో భారీగా ఉద్యోగాలు.. కాంపిటేషన్ తక్కువ, దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే..!

EMRS Recruitment: ఈ ఉద్యోగం కొడితే గోల్డెన్ లైఫ్.. మొత్తం 7,267 ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు భయ్యా

AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు

Big Stories

×