Dhee Bhoomika : ఢీ (Dhee).. బుల్లితెర ప్రేక్షకులను నిర్విరామంగా ఎంటర్టైన్ చేస్తూ ఎంతోమంది టాలెంట్ ను వెతికి పడుతూ.. ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఏకైక డాన్స్ షో ఢీ అని చెప్పవచ్చు. భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎంతోమంది తమ డాన్స్ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఢీ వేదికగా మారింది. ఇక ఈ షోలో పర్ఫామెన్స్ ఇచ్చారు అంటే వారికి కష్టపడకుండానే పాపులారిటీ లభిస్తుంది అని చెప్పవచ్చు. అలా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఢీ కంటెస్టెంట్ భూమిక (Bhoomika)కూడా ఒకరు. ఢీ సీజన్20లో తన డాన్స్ తో ఎంటర్టైన్ చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో శేఖర్ మాస్టర్ కూడా ఈమె డాన్స్ కి, గ్రేస్ కి ఫిదా అయిపోయారు అంటే.. ఇక ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఐదు నెలలుగా దూరం ఉంటున్న ఢీ కంటెస్టెంట్ భూమిక..
ఇక ఇప్పటికీ కూడా కంటెస్టెంట్ గా చేస్తున్న ఈమె.. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ అభిమానులను కలవరపాటుకు గురి చేసింది. ముఖం నిండా గాయాలతో కనిపించి ఒక్కసారిగా భయం కలిగించింది. ఈ మేరకు ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. గత ఐదు నెలలుగా నేను వెనకడుగు వేయడానికి కారణం ఇదే. ఇన్ని నెలలు ఏం చేస్తున్నావ్? నువ్వు ఎక్కడ, ఎందుకు యాక్టివ్ గా ఉండడం లేదు? అకస్మాత్తుగా ఎందుకు కనిపించకుండా పోయావ్? ఎందుకు లావు అయ్యావు? ఇలా అడుగుతున్న ప్రతి ఒక్కరికి ఇదే నా సమాధానం. మళ్లీ నేను కొత్తగా నన్ను నేను బలపరచుకోవడానికి ఇన్ని నెలల సమయం పట్టింది. ఎవరికైనా సరే నాలాంటి పరిస్థితి ఏర్పడితే, బాధపడకండి. కొత్త శక్తితో రెట్టింపు వేగంతో తిరిగి రండి. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లోనే చాలామంది మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. కానీ లెజెండ్ బాబ్ ఏమన్నారో తెలుసా.. “నువ్వు ఎంత బలంగా ఉన్నావో నువ్వు బలపడే వరకు నీకు తెలీదు” అన్నారు. అందుకే ఆ మాటలను గుర్తు పెట్టుకొని ఇప్పుడు నేను మరింత బలంగా మారాను”.
యాక్సిడెంట్ కారణంగా మొత్తం మారిపోయింది – భూమిక
నాకు ఈ ఏడాది మార్చి 19న యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో నాకు తగిలిన దెబ్బల వల్ల నేనిలా అయిపోయాను. నా కారు మొత్తం తుక్కుతుక్కు అయిపోయింది. ఇక ఈ యాక్సిడెంట్ వల్ల నొప్పితో నాట్యం చేయలేకపోయాను. ఆ దెబ్బల కారణంగా బరువు పెరిగిపోయాను. అయితే నేను ఇక్కడ సంతోషించే విషయం ఏమిటంటే.. దేవుడు నన్ను ఇంకా బ్రతికించాడు అని.. ఇక ఇప్పుడు ఢీ లోకి మళ్ళీ అడుగు పెట్టబోతున్నాను” అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఢీ షో కి సంబంధించిన పర్ఫామెన్స్ వీడియోతో పాటు తనకు యాక్సిడెంట్ అయిన వీడియోని కూడా పంచుకుంది భూమిక.
రీ ఎంట్రీలో మరింత స్ట్రాంగ్..
భూమికకి యాక్సిడెంట్ అయిందని, ఆ కారణంగానే ఐదు నెలలుగా షోకి దూరమైందని తెలిసి ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు .. ఇప్పుడు రెట్టింపు వేగంతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నానని చెప్పి అందరిని సంతోషపరిచింది. ఇక మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
ALSO READ:Arebia Kadali Review: అరేబియా కడలి రివ్యూ.. తండేల్‌కి తక్కువే ?
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==