Smriti Irani: సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు (Politics)ఎంతో మంచి అవినాభావ సంబంధం ఉంది. సినిమాలలో నటించేవారు రాజకీయాలలోకి వెళ్లి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఇక రాజకీయాలలో గెలుపోటములు అనేది సర్వసాధారణం. ఇలా ఎన్నికలలో ఓటమిపాలు అయిన తర్వాత తిరిగి సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వస్తు నటనపరంగా బిజీ అవుతుంటారు. ఇలా రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన వారిలో కేంద్రమంత్రి(Central Minister) స్మృతి ఇరానీ (Smirit Irani)కూడా ఒకరు. కేంద్ర మంత్రిగా కీలకమైన బాధ్యతలు చేపట్టిన ఈమె ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరమైనప్పటికీ తాను ఫుల్ టైం రాజకీయ నాయకురాలినని నటన అనేది పార్ట్ టైం మాత్రమే అని చెబుతూ వచ్చారు.
నటిగా స్మృతి ఇరానీ…
ఇకపోతే గతంలో ఎన్నో అద్భుతమైన టీవీ సీరియల్స్ లో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న స్మృతి ఇరానీ రాజకీయాలలో బిజీ అయిన నేపథ్యంలో సీరియల్స్ కు కాస్త దూరమయ్యారు. ఈమె నటించిన బుల్లితెర సీరియల్స్ లో “క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ”(Kyunki Saas Bhi Kabhi Bahu Thi)అనే హిందీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ 2000 నుంచి 2008 వరకు ఎంతో అద్భుతమైన రేటింగ్ కైవసం సొంతం చేసుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక ఈ సీరియల్ లో స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈమె రాజకీయాలలో బిజీ అయిన నేపథ్యంలో నటనకు దూరమయ్యారు.
ఒక్క ఎపిసోడ్..రూ.14 లక్షల రెమ్యూనరేషన్…
ఇక ప్రస్తుతం ఈమె తిరిగి ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడంతో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న “క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ 2” సీరియల్ ద్వారా మరోసారి స్మృతి ఇరానీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రసారం అవ్వడమే కాకుండా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సీరియల్ కోసం స్మృతి ఇరానీ తీసుకున్న రెమ్యూనరేషన్ (Remuneration) గురించి సోషల్ మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. ఈమె ఈ సీరియల్ ఒక్క ఎపిసోడ్ లో పాల్గొంటే సుమారు 14 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని తెలుస్తోంది.
ఆదాయం కోసం పని చెయ్యొద్దు…
ఇలా ఒక సీరియల్ ఎపిసోడ్ కోసం 14 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు స్మృతి ఇరానికి నటనపరంగా, అభిమానులు ఎంతలా ఆదరిస్తున్నారో స్పష్టమవుతుంది. ఇప్పటికీ కూడా ప్రేక్షకులలో ఈమె పట్ల ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న స్మృతి ఇరానీ.. మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు ఎప్పుడు మనం ఖాళీగా ఉండకూడదని నిరంతరం ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలని తెలిపారు. ఏదైనా పని చేసేటప్పుడు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చేయాలి తప్ప ఆదాయాన్ని ఆశించి పని చేస్తే మన లక్ష్యం నెరవేరదంటూ ఈ సందర్భంగా ఈమె అందరికీ స్ఫూర్తిని కలిగించే విషయాలను కూడా తెలియజేశారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మరోసారి సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఈ సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా సీరియల్ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ద్వారా కూడా వార్తల్లో నిలిచారు.
Also Read: Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!