E-Paper
Advertisement

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..
Advertisement

Intelligence Bureau Recruitment: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగు రోజుల క్రితం అధికారులు షార్ట్ నోటీస్ ను విడుదల చేశారు. దీనిలో ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియ విధానం హోం శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబందించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకుందాం.

ఇంటెలిజెన్స్ బ్యూరోలో మొత్తం 3717 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ -2/ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియ హోంశాఖ (Ministry of Home Affairs) ఆధ్వర్యంలో జరగనుంది.

Advertisement

మొత్తం వెకెన్సీల సంఖ్య: 3717

విద్యార్హత: డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (కంప్యూటర్ నైపుణ్యం ఉంటే బెటర్)

Advertisement

ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 19

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్ట్ 10

వయస్సు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.650 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.550 ఫీజు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: మూడు దశల్లో ఉంటుంది. టైర్-1 పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), తర్వాత టైర్-2 (డెస్క్రిప్టివ్ టైప్), ఆపై ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మూడు దశల్లో మెరిట్ సాధించిన వారికి ఉద్యోగం వస్తుంది.

జీతం: ఈ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వ లెవల్- 7 పే స్కేల్ వర్తించనుంది.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతనం లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సదుపాయాలు కూడా ఉంటాయి. మరి అర్హత ఉన్నవారు జులై 19న విడుదలయ్యే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://गृहमंत्रालय.सरकार.भारत/en

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటేనే ఈ  ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు వేతనం లభిస్తుంది. ఇతర అలవెన్సులు, సదుపాయాలు కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 3717

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 10 (దరఖాస్తుకు 2 రోజుల సమయం మాత్రమే ఉంది..)

ALSO READ: NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×