BigTV English
Advertisement

GT vs MI, Eliminator: నేడే బిగ్ ఫైట్..రిజర్వ్ డే లేదు, వర్షం పడితే విజేత ఎవరు.. టెన్షన్ లో ముంబై

GT vs MI, Eliminator:  నేడే బిగ్ ఫైట్..రిజర్వ్ డే లేదు, వర్షం పడితే విజేత ఎవరు.. టెన్షన్ లో ముంబై

GT vs MI, Eliminator: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఐపిఎల్ టోర్నమెంట్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ ఇవ్వాలా నిర్వహించబోతున్నారు. ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఫైట్ జరగనుంది. పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ అలాగే నాలుగో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ కు ముల్లాన్పూర్ వేదిక కానుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ కూడా ఇక్కడే జరిగింది. అందులో మొదట బౌలింగ్ చేసిన బెంగళూరు విజయం సాధించింది కాబట్టి.. ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు…కూడా మొదట బౌలింగ్ తీసుకునే ఛాన్సులు ఉన్నాయి.


Also Read: PBKS vs RCB Qualifier 1: కోహ్లీకి కెప్టెన్సీ..సుయాష్ శర్మ రచ్చ.. డీలా పడిన చాహల్ లవర్

వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఎలా ?


ఐపిఎల్ 2025 టోర్నమెంట్లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి గా మారితే పరిస్థితి ఏంటి అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఒకవేళ వర్షం పడి… మ్యాచ్ ఆడలేని స్థితి ఉంటే కచ్చితంగా… గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుంది. పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉన్నందున… క్వాలిఫైయిర్ 2 కు గుజరాత్ టైటాన్స్ దూసుకు వెళ్తుంది. అదే సమయంలో ముంబై ఇండియన్స్ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.

ఎలిమినేటర్ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదా?

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఎలిమినేటర్ మ్యాచ్ కు వర్షం విలన్ గా మారితే… కొత్త రూల్స్ అమలు చేయాల్సి వస్తుంది. ఈసారి ఎలిమినేటర్ మ్యాచ్ కు ఎలాంటి రిజర్వ్ డే కూడా పెట్టలేదు. కానీ.. ఇవాల్టి రోజున 120 నిమిషాలు ఎక్కువ.. మ్యాచ్ కొనసాగించుకోవచ్చు. అంటే మ్యాచ్ టైమింగ్స్ పెంచారు. ఈ ఐపిఎల్ 2025 టోర్నమెంట్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే.. రోజులో మ్యాచ్ టైమింగ్.. పెంచిన నేపథ్యంలో రిజర్వు డే తీసేశారు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే గుజరాత్ టైటాన్స్… క్వాలిఫైయర్ 2 కు వెళ్తుంది.

 

Also Read: IND vs ENG Test Series : ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

ముంబై ఇండియన్స్ VS గుజరాత్ టైటాన్స్ జట్ల అంచనా

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ XII: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో, సూర్యకుమార్ యాదవ్, చరిత్ అసలంక, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్/కర్ణ్ శర్మ

గుజరాత్ టైటాన్స్ ప్రాబబుల్ XII: సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, కుసల్ మెండిస్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, అర్షద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

Related News

Nigar Sultana : డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Gambhir-Shubman Gill: గిల్‌కు క్లాస్ పీకిన కోచ్ గంభీర్..నీకు సోకులు ఎక్కువ, మ్యాట‌ర్ త‌క్కువే అంటూ !

PM MODI: వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ ట‌చ్ చేయ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్..ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏం చేశారంటే ?

IND VS AUS, 4th T20: నేడే 4వ టీ20..టీమిండియాకు అగ్ని ప‌రీక్షే..గిల్ వేటు, రంగంలోకి డేంజ‌ర్ ప్లేయ‌ర్ !

RCB ON SALE: అమ్ముడుపోయిన RCB, WPL జ‌ట్లు.. మార్చి నుంచే కొత్త ఓన‌ర్ చేతిలో !

Indian Womens Team: ప్ర‌ధాని మోడీకి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌ల స్పెష‌ల్ గిఫ్ట్‌..”న‌మో” అంటూ

IND VS SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌..ష‌మీకి నిరాశే, పంత్ రీ ఎంట్రీ, టీమిండియా జ‌ట్టు ఇదే

Bowling Action: ముత్త‌య్య, భ‌జ్జీ, వార్న్‌, కుంబ్లే అంద‌రినీ క‌లిపేసి బౌలింగ్‌.. ఇంత‌కీ ఎవ‌డ్రా వీడు!

Big Stories

×