Actor Satya Dev: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్(Satya Dev) ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈయన గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్(King Dom) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నయ్య శివ పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సత్యదేవ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సత్యదేవ్ తనకున్నటువంటి ఒక అలవాటు గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
సలార్ సినిమా చూస్తాను…
సాధారణంగా ఎవరికైనా మనసు బాలేకపోతే వారికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు కొంతమంది మ్యూజిక్ వినగా, కొంతమంది కుకింగ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడ్డారు. సత్యదేవ్ మాత్రం తనకి ఎప్పుడైనా మూడ్ సరిగా లేకపోతే వెంటనే ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన సలార్ సినిమా(Salar Movie) పెట్టుకుని చూస్తానని ఈయన తెలియజేశారు.” నాకు మూడ్ సరిగా లేనప్పుడు సలార్ సినిమా పెట్టుకుని చూస్తాను.. ఆ సినిమా తన మూడ్ మొత్తం మార్చేస్తుందని” ఈ సందర్భంగా సత్యదేవ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ సినిమా వ్యసనంలా మారిపోయింది..
బహుశా ఈ సినిమా చూసేటప్పుడు ఈ సినిమాలోని సంగీతం కావచ్చు, ప్రభాస్ నటన, అందులోని పవర్ ఫుల్ సీన్స్ ఏవైనా కావచ్చు వెంటనే తన మూడ్ మొత్తాన్ని మార్చేస్తుందని ఈ సినిమా చూడటం నాకు ఒక వ్యసనంలా మారిపోయిందని ఈ సందర్భంగా సత్యదేవ్ సలార్ సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు సంతోష పడగా మరి కొంతమంది ఇలాంటి అలవాట్లు కూడా ఉంటాయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ హీరోగా సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి.. సిల్వర్ స్క్రీన్ వరకు…
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 2023వ సంవత్సరంలో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రశాంత్ భారీగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. అతి త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక సత్యదేవ్ విషయానికి వస్తే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన సినీ ప్రయాణం మొదలుపెట్టి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాష సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ కెరియర్ ప్రారంభించిన సత్యదేవ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. జ్యోతిలక్ష్మి సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సత్యదేవ్ ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ తమిళ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!