BigTV English

Kaniha: ఒట్టేసి చెబుతున్నా హీరోయిన్ కు ఏమైంది.. ముఖం మొత్తం కాలిపోయి.. ఇంత భయంకరంగా

Kaniha: ఒట్టేసి చెబుతున్నా హీరోయిన్ కు ఏమైంది.. ముఖం మొత్తం కాలిపోయి.. ఇంత భయంకరంగా

Kaniha: ఒట్టేసి చెప్తున్నా.. వింటున్నావా ఓ మైనా సాంగ్  గుర్తుందా.. ?  శ్రీకాంత్  హీరోగా నటించిన  ఒట్టేసి చెప్తున్నా సినిమా గురించి వైన్ ఉంటారు. ఆ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన  బ్యూటీ కనిహా సుబ్రమణ్య. కలువల్లాంటి కళ్లు .. గుండ్రటి ఫేస్ తో తెలుగు అభిమానులను ఈ చిన్నది ఎంతో ఆకట్టుకుంది. ఈ సినిమా  మరి అంత  భారీ విజయాన్ని అందుకోలేకపోయినా.. కనిహాకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.


ఇక ఈ సినిమా తరువాత కనిహా.. నా ఆటోగ్రాఫ్  సినిమాలో రవితేజ భార్యగా గెస్ట్ రోల్ లో  కనిపించింది. ఇక తెలుగులో అవకాశాలు దక్కకపోవడంతో ఈ చిన్నది.. తమిళ్, మలయాళంలో సెటిల్ అయిపోయింది. ముఖ్యంగా  మలయాళంలో కనిహా తన సత్తా చాటింది. 2008 లో శ్యామ్ రాధాకృష్ణన్ ను వివాహామాడిన ఆమె.. ఆ తరువాత తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు.

ఇక ఈ మధ్యనే విజయ్ నటించిన ది గోట్ మూవీలో కనిహా ఒక కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా  ఆమెకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది.  ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా.. ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. మీనన్ భార్యగా  ఆమె కనిపించింది.  ఇక ఇందులో సగం కాలిపోయిన ముఖంతో ఆమె కనిపించిన విషయం  తెల్సిందే.


తాజాగా ఆ క్యారెక్టర్  బిటిఎస్ ఫోటోలను షేర్ చేస్తూ.. వెంకట్  ప్రభుకు ధన్యవాదాలు తెలిపింది. ” గోట్ లో నేను అతిధి పాత్రలో కనిపిస్తాను.. అయితే ఆ ఒక్క సీన్ వెనుక ఏం జరుగుతుంది??? చాలామందికి తెలియదు!! దీనికి కావాల్సింది ఇక్కడ ఉంది.. ఆర్టిస్ట్‌గా ఉండటాన్ని నేను ఆస్వాదిస్తాను, రూపాంతరం చెందుతాను, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాను.. అది చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా జీవం పోయడం మాకు అలవాటు. ఈ పాత్రను నాకు అందించిన డైరెక్టర్ వెంకట్ ప్రభుకు ధన్యవాదాలు ” అంటూ రాసుకొచ్చింది. 

అసలు కనిహా ముఖం చేస్తే ఎంతో భయంకరంగా కనిపిస్తుంది. గోట్ సినిమా చూడనివారు కనుక.. సడెన్ గా కనిహా ముఖాన్ని చూస్తే.. నిజంగా ఆమెకు ఏమైనా అయిందేమో అని భయపడకుండా ఉండలేరు. అంతలా ఆమె మేకప్ కనిపిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది.. తెలుగులో కూడా మంచి అవకాశం వస్తే వదలను అంటోంది. మరి ముందు ముందు కనిహా తెలుగులో కూడా   కనిపిస్తుందేమో చూడాలి. 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×