BigTV English

Sandal Wood: గంధంతో అద్భుతమైన ముఖ సౌందర్యం.. ఈ సమస్యలు కూడా పరార్..

Sandal Wood: గంధంతో అద్భుతమైన ముఖ సౌందర్యం.. ఈ సమస్యలు కూడా పరార్..

Sandal Wood: ఆయుర్వేదంలో చర్మ సౌందర్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ సౌందర్యం మాత్రమే కాదు.. చర్మంపై ఏర్పడే చాలా రకాల సమస్యలను కూడా తొలగించడానికి కేవలం ఒక పదార్థంతో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అందులో ముఖ్యంగా గంధంతో చర్మానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. గంధాన్ని తరచూ చర్మ సౌందర్యానికి వాడడం వల్ల మచ్చలు, మొటిమలు, దురద వంటి చాలా రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇది సహజసిద్ధమైన ఓ పదార్థం అనే అయినా కూడా చాలా రకాల ప్రయోజనాలు ఇస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.


మొటిమలు మాయం :

చర్మ సమస్యలు ఎదురైనప్పుడు గంధాన్ని ఉపయోగించడం వల్ల అలర్జీల రాకుండా రక్షిస్తుంది. దీని వల్ల మొటిమలు కూడా దూరం అవుతాయి. తరచూ గంధాన్ని వాడడం మంచిది. ఈ తరుణంలో ఒక స్పూన్ గంధం నూనె, కర్పూర్, పసుపు కలిపి ఫేస్ ప్యాక్ లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఇలా రాత్రంతా ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల మోటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.


మెరిసే చర్మం :

మెరిసే చర్మం పొందాలనుకునే వారు గంధాన్ని వాడడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. గంధంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నల్ల మచ్చలను పోగొట్టి, చర్మంపై ఉన్న మురికిని కూడా తొలగించి కాంతివంతంగా తయారుచేస్తుంది. అంతేకాదుగంధంలో ఎక్స్ ఫోలియేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో గంధాన్ని ఓ టేబుల్ స్పూన్ తీసుకుని అందులో కొబ్బరి నూనె కలుపుకుని దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా రాత్రంతా మసాజ్ చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న డార్క్ స్పాట్స్ తొలగిపోయి చర్మం మెరిసిపోతుంది.

వృద్ధాప్యానికి చెక్‌ :

గంధంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడి చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది. అంతేకాదు చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది. మరోవైపు చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.

పొడి చర్మం :

పొడి చర్మం వంటి సమస్యలతో బాధపడేవారు గంధాన్ని ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అందువల్ల గంధంలో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. టీ స్పూన్ గంధం, పాల పొడి, రోజ్ వాటర్ కలుపుకుని పేస్ట్ లా తయారుచేసి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం అందంగా మారుతుంది.

జిడ్డు చర్మం :

జిడ్డు చర్మంతో బాధపడేవారు గంధంలో ముల్తానీ మట్టి కలుపుకుని 15 నిమిషాల పాటు అప్లై చేసుకోవడం వల్ల చర్మం అందంగా మారుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×