Bollywood Heroine : టాలీవుడ్ యంగ్ హీరో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈయనతో నటించిన హీరోయిన్లు ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ను అందుకున్నారు.. డార్లింగ్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ తో ఓ సినిమా చేశారు అదే సాహో.. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. శ్రద్ధా కపూర్ అందాలు ఓ మాదిరిగా ఆకట్టుకున్నాయి కానీ సినిమాకు ప్లస్సుగా నిలవలేకపోయాయి.. హీరో ప్రభాస్ మాత్రం ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. శ్రద్దా కపూర్ మాత్రం తెలుగులో ఆ తర్వాత ఒక్క సినిమా కూడా ఒప్పుకున్నట్లు కనిపించలేదు.. రీసెంట్గా పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించినట్లు ఆమధ్య వార్తలు వినిపించాయి. ఈమె గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
శ్రద్ధా కపూర్ డేటింగ్ లో ఉందని వార్తలు వినిపించాయి. గతంలో ఈమె గురించి ఎన్నో వార్తలు చర్చనీయాంశంగా మారాయి. కొందరు స్టార్ హీరోలతో డేటింగ్ లో ఉందని పుకార్లు కూడా రేంజ్ లో వినిపించాయి. ఇప్పుడు మరొకరితో డేటింగ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రియుడుతో డేటింగ్ లో ఉన్న విషయం గురించి క్లారిటీ ఇచ్చింది. లవ్వు బ్రేకప్ అనేవి శ్రద్ధా కపూర్ కి కొత్తేమి కాదు. గతంలో వన్‌రాజ్ జవేరీ అనే బిజినెస్ మ్యాన్‌తో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి.. కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడిపోయారు. బాలీవుడ్ హీరో రాయి ఆదిత్య కపూర్ తో ప్రేమాయణం నడిపిందని వార్తలు కూడా వినిపించాయి. సీనియర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్‌తో చెట్టాపట్టాలేసుకొని లైఫ్‌ను లీడ్ చేసింది. ఇలా పార్ట్ టైమ్ డేటింగ్ లైఫ్ వార్తల తర్వాత.. రోహన్ శ్రేష్టతో డేటింగ్ లో ఉందనే వార్తలు కూడా ఈ మధ్య ఇండస్ట్రీలో వినిపించాయి. ఇప్పుడు మరొకరితో రహస్య ప్రేమాయణం నడుపుతుందని కొన్ని రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రేమించింది ఎవరినో కాదు బాలీవుడ్ స్క్రీన్ రైటర్ డైరెక్టర్ని ప్రేమించింది..
ఈమె జీవితంలో ఏ బంధం కూడా సరిగ్గా నిలవలేదని అర్థమవుతుంది. ప్రస్తుతం స్క్రీన్ రైటర్ రాహుల్ మోడీతో సహజీవనం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనతో డేటింగ్ లో ఉందన్న విషయాన్ని చెప్పడానికి శ్రద్ధ కపూర్ ఇష్టపడలేదు. ఇద్దరూ సీక్రెట్ గా కలుసుకోవడం మీడియా కంటపడింది. ఇద్దరూ కలిసి బయటి తిరగడం ఇటీవల చాలా సార్లు సోషల్ మీడియాలో ఫోటోలు కనిపించాయి. ఈమధ్య తన ప్రియుడు రాహుల్తో కలిసి ఒకే డ్రెస్ లో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో ఎంతవరకు వైరల్ అయిందో మనం చూసాం.. వీరిద్దరూ కలిసి గతంలో ఓ సినిమాకి పనిచేశారు ఆ క్రమంలోని పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు.. అసలు వీరిద్దరి మధ్య నిజంగానే అలాంటి సీక్రెట్ ఎవరు నడుస్తుందా లేదా అన్నది తెలియదు.. పెళ్లి చేసుకుంటారో లేదా అనే విషయాం తెలియయాల్సి ఉంది.