BigTV English

Pan India Star: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో బ్యాక్ టు బ్యాక్‌ అరడజన్‌ చిత్రాలు

Pan India Star: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో బ్యాక్ టు బ్యాక్‌ అరడజన్‌ చిత్రాలు

Pan India Star Prabhas Has 6 Films Back To Back: తెలుగు మూవీ హీరోల చేతిలో ఒకటి, రెండు సినిమాలు ఉండగా.. మన డార్లింగ్‌ ప్రభాస్‌కి మాత్రం ఏకంగా అరడజన్‌కి పైగా సినిమాలు ఉన్నాయి. అవి కూడా ఆశా మాషి సినిమాలు కాదండి బాబు.. అవన్నీ కూడా వందల కోట్లతో కూడిన భారీ బడ్జెట్‌ సినిమాలు. తాజాగా వచ్చిన కల్కితో సాలిడ్ హిట్‌ని అందుకున్న ప్రభాస్. ఈ మూవీ థియేట్రికల్ రన్ కంప్లీట్ కాకుండానే కొత్త మూవీ లైన్లో పెట్టి స్టార్ట్ చేసేశాడు. దర్శకుడు హనూ రాఘవపూడితో తన నెక్స్ట్ మూవీని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు.


ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ టీమ్ భారీ బడ్జెట్‌ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ కంటె ముందే ప్రభాస్ భారీ బడ్జెట్‌ మూవీస్‌తో కమిట్ అయి ఉన్నాడు. అంతేకాకుండా ఈ మూవీ అనే కాదు అసలు ఈ సీక్వెల్‌గా సలార్ 2, కల్కి 2 లైన్‌లో ఆల్‌రెడీ ఉన్నాయి. అంతేకాదు ఈ సీక్వెల్స్‌పై ఎక్కడా లేని అంచనాలు ఆడియెన్స్‌లో ఉన్నాయి. ఇక మారుతి డైరెక్షన్‌లో రాబోతున్న రాజాసాబ్ మూవీ షూటింగ్ పనుల్లో డార్లింగ్‌ బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 2025 ఏప్రిల్ 10 నాటికి రిలీజ్ కానుంది. ఇక సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీని అనౌన్స్ చేశాడు. ఇక ఈ మూవీ కూడా అతిత్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

Also Read: చిరు కోసమే ఆ సీన్‌ చేశానంటూ యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్


అంతేకాకుండా మంచు విష్ణు కెరీర్‌లోనే అతి భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీలో నటిస్తున్నాడు మన డార్లింగ్. అంతేకాదు ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు విష్ణు తెరకెక్కిస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. మిగతా హీరోలు ఒక మూవీ అయిపోగానే మరో మూవీని లైనప్ చేస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం అలా కాకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు తనకు నచ్చిన జనాలు మెచ్చిన సినిమాలు చేసుకుంటూ రెస్ట్ లేకుండా హిట్ మూవీస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అవి కూడా వందల కోట్ల బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. ఏదేమైనా అన్ని సినిమాలను మ్యానేజ్ చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×