E-Paper
Advertisement

Bagheera: థియేటర్ కు వెళ్ళడానికి ఈ ఒక్క సాంగ్ చాలు మావా.. ఎంత బావుంది

Bagheera: థియేటర్ కు వెళ్ళడానికి ఈ ఒక్క సాంగ్ చాలు మావా.. ఎంత బావుంది
Advertisement

Bagheera: కన్నడ స్టార్ హీరో శ్రీమురళీ హీరోగా తెరకెక్కిన చిత్రం బఘీర. డా. సూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథను అందించాడు. ఇక ఈ సినిమాను కెజిఎఫ్ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో శ్రీమురళీ సరసన సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా అక్టోబర్ 31 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో శ్రీమురళీ ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో  ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్..  తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ లవ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. పరిచయమేలే అంటూ సాగిన ఈ సాంగ్  ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సోల్ ఫుల్ మెలోడీ  సాంగ్స్ లిస్ట్ లో ఈ సాంగ్ కూడా యాడ్ చేసేస్తున్నారు అభిమానులు. ప్రతి ఉదయం వెతికే కన్నులే.. నిను చూసి నిలిచే చూపులే అంటూ మొదలైన ఈ లిరిక్స్ ను  రాంబాబు గోసల అందించగా.. కెజిఎఫ్ కు మ్యూజిక్ అందించిన అంజనీష్ సంగీతం అందించాడు.

Advertisement

Esther Anil: బికినీలో వెంకటేష్ రీల్ కూతురు.. ఏముందిరా మావా..

ఇక ఈ సాంగ్ ను రితేష్ జి రావు  మరింత అద్భుతంగా ఆలపించారు. పోలీస్ అయిన హీరో.. డాక్టర్ అయిన హీరోయిన్ తో ప్రేమలో  పడతాడు. చుట్టూ రౌడీలు ఉన్నా కూడా ఆమె గురించే ఆలోచిస్తూ తనలో తానే నవ్వుకుంటూ ప్రేమలో విహరిస్తూ కనిపించాడు. ఇక శ్రీమురళీ, రుక్మిణీ జంట చూడముచ్చటగా  ఉన్నారు. వారి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది.

Advertisement

తెలుగులో ఇలాంటి సాంగ్స్ చాలా వచ్చినా.. ఇదొక కొత్త అనుభూతిని అందిస్తుంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ప్రేమికుల లిస్ట్ లో ఈ సాంగ్ కచ్చితంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ విన్న నెటిజన్స్.. థియేటర్ కు వెళ్ళడానికి ఈ ఒక్క సాంగ్ చాలు మావా.. ఎంత బావుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో శ్రీమురళీ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×